తక్కువ ధరలకే వినియోగదారులు కోరుకున్న మోడల్స్ లో ఇళ్లు కట్టించి ఇస్తానని.. ప్రీలాంచ్ రాయితీ పేరుతో ఎంతో మందిని సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మందిని మోసగించిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ బూదాటి లక్ష్మినారాయణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు డిసెంబర్ 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనను తమ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మూడ్రోజుల పాటు ఆయన నుంచి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయని సమాచారం.
తక్కువ ధరలకే ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో ప్రజల నుంచి యజమాని బూదాటి లక్ష్మీనారాయణ రూ.వందల కోట్లు వసూలు చేశారని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులు సైతం రూ.లక్షలు దోచుకున్నారని సమాచారం. ఇప్పుడీ ఈ అంశంపై పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడుతుండటంతో లక్షల రూపాయలు నొక్కేసిన ఉద్యోగులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు.
ఇలా ఉద్యోగులు కాజేసిన సొమ్ము రూ.100 కోట్లు ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసులతో భయపడిన సదరు ఉద్యోగులు రూ.40 కోట్లు ఇస్తామంటూ లక్ష్మీనారాయణతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అనంతరం ఆయనకు రూ.10 కోట్లు ఇచ్చారు. లక్ష్మీనారాయణ అరెస్ట్‌తో వారంతా ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
సాహితీ సంస్థలో బాధితుల సొమ్ములో కొంత భాగం మార్కెటింగ్ ఉద్యోగులు దోచుకున్నట్టు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. సాహితీ సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ.. మార్కెటింగ్ కోసం కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. ఉద్యోగులకు నెలవారీ వేతనంతోపాటు స్థాయిని బట్టి 10–20 శాతం కమీషన్ కూడా ఇచ్చారు.
ప్లాట్ల రోజువారీ విక్రయాలు, నగదు జమ తదితర లావాదేవీల కోసం మరా–మి అనే సాఫ్ట్‌వేర్‌ను సాహితీ సంస్థ ఉపయోగించింది. అయితే ఇందులో ఉన్న సాంకేతిక లోపాలను కొందరు ఉద్యోగులు సావకాశంగా తీసుకుని మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రజల నుంచి చెక్కులు, ఆన్‌లైన్ రూపంలో వచ్చిన వాటిని మాత్రం సంస్థకు చెల్లించారని.. నగదు రూపంలో చేతికి అందిన సొమ్మును మాత్రం సొంత ఖాతాల్లోకి ఉద్యోగులు మళ్లించేసుకున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని పూర్తి నగదును సంస్థ ఖాతాల్లోకి చేర్చుతున్నట్టు ఏమార్చారని పోలీసులు చెబుతున్నారు.
కాగా వెంచర్ల కోసం హైదరాబాద్ నగర శివార్లలో 11 చోట్ల ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేశారని లక్ష్మీనారాయణపై ఆరోపణలు వచ్చాయి. వీటిలో అమీన్‌పూర్ లోని స్థలాలు మినహా మిగిలిన 2–3 ప్రాంతాల్లోని భూములు వివాదంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నగర శివార్లలో నాలుగు ఎకరాలకు సంబంధించి, మరో ప్రాంతంలోని 5 ఎకరాల భూమి వివాదంలో ఉన్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.