ఎక్కడైనా కొత్త జీతాల కోసం పోరాటాలు చేస్తారు. ఆందోళనలు చేపడతారు. సమ్మెలు చేస్తారు. అంతేకానీ.. కొత్త జీతాలు వద్దు.. పాత జీతాలే ముద్దు అనే విచిత్ర పరిస్థితి ఏపీలో మాత్రమే కనిపిస్తుంది. పీఆర్సీ అంటూ ఊరించిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు దాని పేరు మీద తీసుకున్న నిర్ణయం.. ఇప్పటికే వస్తున్న జీతాలకు కోత పెట్టేలా ఉండటం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ గా మారింది. కొత్త జీతాలు వద్దు కానీ పాత జీతాలు ఇవ్వమంటూ ఇప్పుడు రివర్సు గేరులో ఆందోళనలు చేపడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. సమ్మె నోటీసు ఇవ్వటం తెలిసిందే. ఇవాళ కాకున్నా.. రేపటికైనా మాట్లాడుకోవాల్సిందేగా? అంత దాకా ఎందుకు.. ఇప్పుడే చర్చలకు రావాలంటూ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాగా.. కొత్త జీతాల్ని నిలిపివేస్తామన్న మాట ఇస్తే వస్తామని ఉద్యోగులు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో పాత జీతాల గురించి మర్చిపోండి.. కొత్త జీతాలే ఖాయమని తేల్చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. తాజాగా ఉద్యోగుల పోరు మీద సజ్జల మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న పోరు కారణంగా.. కొత్త జీతాల ప్రాసెస్ ఆలస్యమవుతుందన్న ఆయన.. ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు చర్చలకు వచ్చి ఉంటే..పాత జీతాల గురించి ఆలోచించి ఉండే వారిమని.. ఇప్పుడు ఆ అవకాశం పోయిందని.. కొత్త జీతాలే తథ్యమని తేల్చేయటం గమనార్హం.
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ ఉద్యోగుల జీతాల మీద సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి.. ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెంచేలా చేస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల జీతాలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు.. ఉద్యోగ సంఘాల నేతలు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్న ఆయన.. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగుల సంఘాలు ప్రస్తావించటం లేదన్నారు.
జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలన్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ పై సజ్జల స్పందిస్తూ.. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండేదని వ్యాఖ్యానించటం గమనార్హం. కానీ.. ఉద్యోగులు చర్చలకు రాకపోవటం వల్ల ఈ నెల వరకు పాత జీతాలు తీసుకునే అవకావాన్ని మిస్ అయ్యారన్న అర్థంగా మాట్లాడిన మాటలు ఉద్యోగసంఘాలకు మంట పుట్టిస్తున్నాయి. ఒకవేళ.. నిజంగానే ఉద్యోగుల ఇష్యూను క్లోజ్ చేయాలన్న ఆలోచనే ఉంటే.. లోగుట్టుగా ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చి.. చర్చలకు వస్తే.. వారు కోరుకున్నట్లే పాత జీతాలు ఇచ్చేస్తామని చెప్పి ఉంటే.. అసలీ ఇష్యూనే ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. అదేమీ చేయకుండా మీడియాతో చిట్ చాట్ పేరుతో ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చేసిన సజ్జల తీరుపై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.