ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధం కాగా , ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే,కరోనా కారణంగా ఎన్నికలు రద్దు చేస్తునట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. నిమ్మగడ్డ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇక అప్పటి నుండి ఎన్నికల కమిషన్ కి , ఏపీ ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికలకి సిద్ధం అంటూ చెప్తుంటే , కరోనా అని ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధంగా లేము అని చెప్తుంది.
అయితే , ఫిబ్రవరి లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని మరోసారి ప్రభుత్వం తో ఒక్క మాట కూడా చెప్పకుండానే ఎన్నికల షెడ్డ్యూల్ ప్రకటించింది ఈసీ. అలాగే రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అని , ప్రభుత్వ పథకాల అమలకి కుదరదు అని ఈసీ చెప్పింది. అయితే , ప్రభుత్వం మాత్రం అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. అలాగే ఎన్నికలపై కోర్టుకి వెళ్లి , ఎన్నికల షెడ్డ్యూల్ ను రద్దు చేసేలా చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాల వెనుక చంద్రబాబు ఉన్నారని, నిమ్మగడ్డ ప్రతి అడుగు చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతుందని, నిమ్మగడ్డ రాజ్యాంగ బాధ్యత ఉన్న వ్యక్తిగా వ్యవహరించడం లేదని వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయానికి, మతానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అన్నది తమ పార్టీ లైన్ అని సజ్జల చెప్తూ , కరోనా సమయంలో ఎన్నికలంటూ ప్రజల ప్రాణాలని సంకటంలో పడేయలేము అని చెప్తుంది. అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఈ సమయంలో ఎన్నికలంటూ నానాహడావిడి చేస్తున్నారు అంటూ అయన మండిపడ్డారు.