సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష పడటం, అనంతరం బెయిల్ పై విడుదలవడం తెలిసిందే! అయితే శుక్రవారం సల్మాన్ బెయిల్ పై విడుదలవడంపై విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! దేశంలో ముస్లిం జనబా పెరిగిపొతుంది కాబట్టి... ప్రతీ హిందూ మహిళా నలుగురేసి పిల్లల్ని కనాలని పిలుపునిచ్చి, దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్న సాధ్వీ మరో సారి ఈ స్థాయి సంచలన వ్యాఖ్యలు చేశారు! కోర్టు తీర్పులపై ఏమైనా సందేహాలుంటే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవాలి కానీ... ఇలా ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి! ఇదే సమయంలో సల్మాన్ సెలబ్రెటీ కాబట్టి బెయిల్ వచ్చిందని పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! అయితే... ఈ సారి సెలబ్రెటీ కాదు, ముస్లిం అయినందుకే బెయిల్ వచ్చిందని మరోసారి దేశసమైఖ్యతకు భంగం వాటిల్లేలా ఒక మెంబర్ ఆఫ్ పార్లెమెంట్ వ్యాఖ్యానించడంపై పెద్ద దుమారమే లేస్తుంది!
ఇదే సమయంలో సల్మాన్ కు శిఖ్స ఖారయినట్లు తీర్పు వెలువడిన తర్వాత... వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, సల్మాన్ ఖాన్ కు వత్తాసు పలికిన బాలీవుడ్ నటులపై కూడా సాధ్వీ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో సింగర్ ను కూడా అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు! చట్టం దృష్టిలో అందరూ సమానమని, బాధితులైన నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని సూచించిన సాధ్వీ... ఆ విషయం అక్కడితో ఆపకుండా... సల్మాన్ ముస్లిం కాకపోయి వుంటే బెయిల్ లభించేది కాదని వ్యాఖ్యానించారు! ఇదే సమయంలో సల్మాన్ కు బెయిల్ ఇచ్చారు కాబట్టి అన్నట్ళు... మాలేగావ్ పేలుళ్ల కేసులో జైల్లో ఉన్న సాధ్వీ ప్రగ్యాను కూడా విడుదల చేయాలని ఈమె డిమాండ్ చేస్తున్నారు! తమ పార్టీ ఎంపీలెవరూ కులమతాలకు సంబందించి, మహిళలను కించపరిచేలా, ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని స్వయంగా ప్రధాని చెప్పినా కూడా వీరు మారడంలేదని, బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు!