ఈ మహిళా కానిస్టేబుల్ కు సలాం చేయాల్సిందే

Update: 2021-06-13 04:30 GMT
చేసేది చిన్న ఉద్యోగమే అయి ఉండొచ్చు. కానీ స్పందించే పెద్ద మనసు ఉండాలే కానీ ఇలాంటి నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. తాజాగా ఒక మహిళా కానిస్టేబుల్ హాట్ టాపిక్ గా మారారు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. పెద్ద పెద్ద అధికారులు సైతం తీసుకోలేని నిర్ణయాన్ని ఆమె మాత్రం చిటికెలో తీసుకోవటం విశేషంగా చెప్పాలి. ఆమె తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిన వారంతా ఆమెకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇంతకూ ఆమె ఏం చేశారంటే..

ముంబయికి చెందిన మహిళా కానిస్టేబుల్ రెహనా షేక్ యాభై మంది పేద పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఒకే స్కూల్ కు చెందిన నిరుపేద పిల్లల్ని దత్తత తీసుకోవటానికి ముందుకు రావటమే కాదు.. వారికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. తన స్నేహితురాలు తనకు ఒక స్కూల్ కు సంబంధించిన కొన్ని ఫోటోల్ని చూపించిందని.. వాటిని చూసిన తర్వాత తన సాయం అవసరమనిపించిందని చెప్పారు.

అందుకే.. ఆ స్కూల్ కు చెందిన యాభై మంది పిల్లల ఖర్చుల్ని భరించటంతో పాటు.. వారు పదో తరగతి వరకు చదివేందుకు అవసరమైన విద్యా ఖర్చుల్ని కూడా తాను భరిస్తానని పేర్కొంది. చేసేది కానిస్టేబుల్ ఉద్యోగమే అయినా.. స్పందించే గుణంలో మాత్రం పెద్ద ఆఫీసర్ కు ఏ మాత్రం తీసిపోని ఆమె తీరుకు పలువురు ఫిదా అవుతున్నారు.
Tags:    

Similar News