ఏపీలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్!
ఈ క్రమంలో తాజాగా వైసీపీ పార్టీకి చెందిన కాకినాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అధికారులు షాకిచ్చారు!
ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు వారం, వర్జ్యం అనే ఆలోచనలు ఏమీ లేకుండా.. పెద్ద వాళ్లు, చిన్నవాళ్లూ అనే తారతమ్యాలు చూడకుండా హైడ్రా వాలిపోతుంది. అక్రమనిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఈ సమయంలో ఏపీలో ఈ తరహా కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.
అవును... అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీలోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు సీరియస్ గా స్పందిస్తున్నారని అంటున్నారు. అనుమతులు లేని నిర్మాణాల విషయంలో మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జేసీబీలతో ఆ అక్రమ నిర్మాణలా సంగతి చూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా వైసీపీ పార్టీకి చెందిన కాకినాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అధికారులు షాకిచ్చారు! ఇందులో భాగంగా ఆయన అనుచరులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు! తాజాగా కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో గల నిర్మాణాలపై అధికారులు విచురుకుపడ్డారు!
ఇందులో భాగంగా... సంతచెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించారంటూ దుకాణాల సముదాయాన్ని కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. జేసీబీతో ఆ నిర్మాణాలను కూల్చేశారు. ఈ సమయంలో ఆ కూలివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు యఘించారు. అయితే... ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.
ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో... భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు!