చింటూ అన్నందుకు హ‌ర్ట‌యిన కేటీఆర్ పెన్ష‌న్ ఆపేయించారు

Update: 2019-12-17 11:45 GMT
కాంగ్రెస్ నేత‌ - ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కొద్దికాలం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ స‌మ్మె జ‌రుగుతున్న సమ‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సంపత్‌ మాట్లాడుతూ...గతంలో ప్రతీ విషయంలో జోక్యం చేసుకున్న కేటీఆర్‌ - హరీష్‌ లు ఎక్కడ పోయారంటూ.. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీరిద్దరు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. చింటూ పింటూలు ఎక్క‌డంటూ ఎద్దేవా చేశారు. చింటూ అంటే కేటీఆర్ అని - పింటూ అంటే హరీశ్ రావ్ అని చెప్పుకొచ్చారు. ఇలా కామెంట్లు చేసినందుకు తనపై కేటీఆర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తాజాగా మీడియా స‌మావేశంలో సంత‌ప్ వాపోయారు.

గాంధీభవన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ మీట్లో సంపత్ మాట్లాడుతూ గ‌త నవంబర్ 22న ఓ సందర్భంలో కేటీఆర్ - హరీశ్‌ రావును తాను చింటూ - పింటూ అని సంభోదించాన‌ని తెలిపారు.  వ్యవహారిక భాషలో అవి బూతులు కాదని స‌ర‌దాకు మాత్ర‌మే తాను అన్నాన‌ని సంప‌త్ వెల్ల‌డించారు. అయితే, వాటి విష‌యంలో తనపై కక్ష గట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని - తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన మీడియాతో వాపోయారు. త‌నకు పెన్షన్ ఇవ్వడం మానేశారని - త‌న గన్ మెన్లను తొలగించారని ఆరోపించారు. అంతేకాకుండా - త‌న తమ్ముడు  దక్కించుకున్న టెండర్లలో పనులు రద్దు చేశారని - ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌ గా ఉన్న త‌ అన్న పదవిని తొలగించారని సంప‌త్ వాపోయారు. త‌న మాటలతో కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారంటూ ఆయన  ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారని సంప‌త్ వ్యాఖ్యానించారు. త‌నపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని సంప‌త్‌ వ్యాఖ్యానించారు. ``నా పైన కక్ష తో చేస్తున్న పనులకు తగిన చర్యలు ఉంటాయి`` అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

పౌరుషం ఉంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల‌ని సంప‌త్ డిమాండ్ చేశారు. ``నేను ఎమ్యెల్యేగా ఉన్నప్పుడు ప్రశ్నలు అడిగితే తప్పించుకొని పోయావు. ఐకియా ఇచ్చిన అనుమతులలో క్విడ్ ప్రో కో జరిగింది. హెరిటేజ్ భవనాన్ని తొలగించి అక్కడ వందల కోట్లు సంపాదించావు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యునిగా నేను 7 సార్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ప్రశ్నలు అడుగుతున్నారని నన్ను ఎమ్యెల్యేగా అక్రమంగా తొలగించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నువ్వు ఎంత వేధించిన కూడా నిన్ను నిల‌దీయకుండా ఆగను కేటీఆర్`` అని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News