మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక.. ముగ్గురు మనమలు మరణించారు. ఈ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత రాజయ్య కుమారుడు అనిల్ కు సంబంధించి విషయాలు బయటకు వచ్చాయి. సారికతో వివాహం తర్వాత సన అనే మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం బయటకు రావటంతో పాటు.. పలు సందర్భాల్లో సారిక కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం బయటకు పొక్కింది.
సారిక.. ఆమె పిల్లల మరణాలకు సంబంధించిన కేసులో రాజయ్య కొడుకు అనిల్ సహజీవనం చేస్తున్న సన పేరును నాలుగో నిందితురాలిగా చేరుస్తూ కేసు బుక్ చేశారు. ఆమె కోసం గాలింపు చర్యల నేపథ్యంలో.. ఇటీవల ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఆమెను పోలీసులు అదుపులో ఉంచుకున్నారని..రహస్యంగా విచారిస్తున్నారని చెబుతున్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే.. పోలీసుల విచారణలో సన కొత్త విషయాన్ని బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. అనిల్ తో జీవనం తనకు సాధ్యం కాదని.. తనకు న్యాయం చేయాలంటూ సన కూడా మాజీ ఎంపీ రాజయ్య వద్ద పంచాయితీ పెట్టిన విషయాన్ని పోలీసులతో చెప్పినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ మాటలో ఎంత నిజం ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా కేసు నుంచి తప్పించుకోవటానికే ఇలాంటి మాటలు చెబుతుందా? లేక.. నిజంగానే అనిల్ తో కలిసి ఉండలేకపోతుందా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రాజయ్య ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ (?) జరిగిన రోజున అసలేం జరిగిందన్న విషయాన్ని సన నుంచి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని చెబుతున్నారు.