నిజమే.. బోనులో నుంచి సింహం బయటకు వచ్చేసింది. బోను లాంటి జైలు గోడల మధ్య బంధీగా దాదాపు మూడున్నర సంవత్సరాలకు పైనే ఉన్న ఆయన గురువారం ఉదయం ఫూణే లోని ఎరవాడ జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషిగా నిరూపితమై జైలుశిక్ష అనుభవించిన ఆయన.. జైల్లో సత్ప్రవర్తన కారణంగా ముందుగా విడుదలయ్యారు.
తన తండ్రి విడుదల గురించి బుధవారం ఆయన కుమార్తె సోషల్ మీడియాలో.. బోనులో నుంచి సింహం బయటకు రానుందంటూ పోస్ట్ చేయటం తెలిసిందే. ఇక.. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. భార్య మాన్యత కుటుంబ సభ్యులు.. బంధువులు జైలు బయట ఆయనకు స్వాగతం పలికారు. జైలు బయటకు వచ్చిన సంజయ్ భావోద్వేగంతో భార్యను దగ్గరకు తీసుకున్నారు. అనంతరం.. జైలు నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఆపై ప్రైవేటు విమానంలో ముంబయి చేరుకున్నారు. సంజయ్ రాకను స్వాగతిస్తూ.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఆయన ప్రయాణించే రహదారిలో ఏర్పాటు చేశారు.
ముంబయిలోని ఆయన నివాసం ఉన్న బాంద్రాలో సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. సంజయ్ దత్ విడుదలపై నిరసన వ్యక్తం చేస్తూ పలువురు ఎరవాడ జైలు వద్ద ఆందోళన చేపట్టారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఎందరో ఖైదీలు సత్ప్రవర్తనతో ఉన్నా.. విడుదల చేయని అధికారులు సంజయ్ దత్ ను మాత్రం విడుదల చేయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.