తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మకు సంబంధించిన బినామీ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దేశంలో మూడు లక్షల నకిలీ కంపెనీల పేరిట పలువురు రూ.1.321 లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్టు ఇటీవల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించగా, వాటిలో 2.2 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. అంతేకాకుండా ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్న వారిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ లిస్ట్ లో శశికళ కూడా ఉన్నారని సమాచారం.
శశికళ నకిలీ కంపెనీల్లో ఫ్యాన్సీ స్టీల్స్ - రెయిన్ బో ఎయిర్ - సుక్రా క్లబ్ - ఇండో-దోహా పెట్రో కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కంపెనీల ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు, ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. వీటిని త్వరలో జప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అన్ని పదవులకు పోగొట్టుకొని శిక్షను అనుభవిస్తున్న శశికళకు ఇది మరో పెద్ద షాక్ వంటిదని అంటున్నారు.
శశికళ కుటుంబ సభ్యులతో పాటుగా పలువురి బినామీల పేరుతో ఉన్నాయని... అనేక కంపెనీలు - మాల్స్ - సినిమా థియేటర్లు - వ్యాపారాలు ఉన్నాయని గతంలో తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. తమిళనాడుతో సహ ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక - తెలంగాణ - కర్ణాటకలో శశికళకు బినామీ ఆస్తులు ఉన్నాయని, జయలలితను అడ్డం పెట్టుకుని శశికళ ఆస్తులు సంపాదిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శశికళ బినామీ ఆస్తుల వివరాలను ఐటీ శాఖ అధికారులు సేకరిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. తాజా పరిణామం ఆమెకు గట్టి షాక్ వంటిదని అంటున్నారు.