ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ శశికళకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి తెరపైకి వచ్చింది. మొన్నా మధ్య వరకూ తన వదిన ఇళవరసితో కలిసి జైల్లో ఉన్న చిన్నమ్మ.. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రత్యేక సెల్ లోకి మారినట్లుగా తెలుస్తోంది. ఇకపై జైల్లో ఒంటరిగా ఉండాలని శశికళ భావిస్తున్నారని.. దీంతో ఆమెను నాలుగో నెంబరు సెల్ లోకి మార్చినట్లుగా సమాచారం.
పరప్పన అగ్రహాన జైల్లోకి శిక్ష అనుభవిస్తున్న శశికళ.. ఈ మధ్యన సందర్శకుల్ని ఎక్కువగా కలుస్తున్నట్లుగా చెబుతున్నారు. సందర్శకుల్ని కలిసే క్రమంలో.. జైలు కారిడార్లో నడుస్తూ వెళుతున్నారని.. ఇది ఆమె భద్రతకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని ఆమె దృష్టికి జైలు అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అధికారుల సూచన మేరకు వీలైనంత తక్కువగా సందర్శకుల్ని కలవాలని చిన్నమ్మ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ మధ్యనే చిన్నమ్మకు పెద్ద దోమల తెర ఒకటి అందజేశారని.. తన గదిలో ఏర్పాటు చేసిన టీవీలో వీలైనంతవరకూ సినిమాలనే ఆమె చూస్తున్నారని.. తమిళ వార్తా ఛానళ్లను ఆమె చూడటం లేదని చెబుతున్నారు. ఉదయం పూట మాత్రం తమిళ పేపర్లను ఆమె చదువుతున్నట్లుగా తెలుస్తోంది. జైలు గదిలో ఉన్న దోమ తెర లోపల కూర్చునే భోజనాన్ని పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం. మొన్నటివరకూ వదినతో కలిసి ఉన్న చిన్నమ్మ.. ఉన్నట్లుండి ఒంటరిగా ఎందుకు ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/