అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం అనంతరం పార్టీని గుప్పెట్లోకి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కని...అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణై కర్నాటకలోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో కష్టం వచ్చింది. ఆమె భర్త నటరాజన్ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
ఈ ఉదయం ఆయనకు ఆరోగ్య సమస్య ఎదురవగా ఆస్పత్రిలో చేర్చామని - పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉందని చెప్పినట్లు నటరాజన్ సన్నిహితులు తమిళ మీడియాతో పేర్కొన్నారు. శశికళ భర్త కిడ్నీలు - కాలేయం దెబ్బతిన్నాయని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
కాగా, కొద్దికాలం క్రితం శశికళ కుటుంబంపై ఐటీ గురి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. మొదట శశికళ - ఆ తర్వాత ఆమె అక్క వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ టార్గెట్ గా సాగిన ఆపరేషన్ అనంతరం చిన్నమ్మ ఆస్తుల మీద పడింది. ఈ క్రమంలో శశికళ భర్త నటరాజన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం పెద్దగా తెరమీదకు రాని నటరాజన్ తాజాగా అస్వస్థత కారణంగా వెలుగులోకి వచ్చారు.