తమిళనాట అమ్మ జయలలిత వారసత్వాన్ని కొనసాగించాలని ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత అచ్చుగుద్దినట్టు అమ్మ హావభావాలు, కట్టుబొట్టుతో వీలైనంతగా తనను తాను మార్చేసుకున్న విషయం తెలిసిందే! తర్వాత సీఎం పీఠాన్ని ఎక్కేందుకు శతవిధాలా తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత పెరోల్‌పై వచ్చిన ఆమె.. ఇప్పుడు ఏకంగా `అమ్మ` కారులోనే తిరుగుతూ అటు అమ్మ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించని ఈ కారు.. ఒక్కసారిగా బయటకు ఎలా వచ్చిందో, అందులోనూ చిన్నమ్మ చేతికి ఎలా వచ్చిందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు!!
టీఎన్09-బీఈ6167.. ఈ నెంబరు గల కారు దివంగత మాజీ సీఎం జయలలితకు ఎంతో ఇష్టం! డ్రైవర్ పక్కనే కూర్చున్న అమ్మను దర్శించుకునేందుకు రోజూ ఎంతోమంది కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా ఉండే సన్నివేశాలు ఇప్పటికీ అందరి కళ్లలోనూ మెదులుతూనే ఉంటాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చిక్కినపుడు రెండు టయోటా బ్రాడా కార్లు, ఒక టెంపో ట్రావలర్, ఒక టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజ్దా మేక్సీ, 1990 మాడల్ కాంటెసా కారు తదితర 9 వాహనాలను కేసులో చేర్చారు. 1996 నాటి ధరల ప్రకారం ఈ వాహనాల విలువ రూ.42.25 లక్షలుగా లెక్క కట్టారు. బైటకు వచ్చిన అనంతరం 6167 కారు వాడటం ప్రారంభించారు.
దీనిపై దినకర్ వర్గంలోని ఒక నేత మాట్లాడుతూ, కార్లన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుకున్నందున తన పేరుపై కార్లు ఉంటే అచ్చిరాదని భావించిన జయలలిత.. దినకరన్ పేరున ఒకటి, అతని భార్య అనూరాధ పేరున మరో కారును కొన్నారట. మరణించే వరకు జయలలిత ఈ రెండు కార్లనే వినియోగించగా, ఆ తరువాత దినకరన్ స్వాధీనంలోకి వచ్చాయట. సదరు కారుపై శశికళ మోజుపడటంతో మరెవ్వరూ వినియోగించ కుండా జాగ్రత్త చేయగా ఆమె కోర్కె మేరకు పెరోల్ ఐదురోజుల వినియోగానికి 6167 కారును బైట పెట్టినట్లు ఆయన వివరించారు.