మొబైల్ జామర్లు పెట్టి.. పేపర్లు కూడా ఇవ్వట్లేదట

Update: 2017-02-10 07:06 GMT
విలావంతమైన ఖైదీల మాదిరిగా మారింది అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి. చిన్నమ్మ.. పన్నీర్ ల మధ్య నడుస్తున్న పవర్ జల్లికట్టులో భాగంగా.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్ని రహస్యప్రాంతాలకు తరలించిన వైనం తెలిసిందే. తన వర్గానికి ఉన్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటానికి చిన్నమ్మ మన్నార్ గుడి మాఫియాను రంగంలోకి దింపినట్లుగా చెబుతున్నారు.

రిసార్ట్ లకు.. హోటళ్లకు ఎమ్మెల్యేల్ని తరలించే క్రమంలో వారి దగ్గరున్న మొబల్ ఫోన్లను తీసేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండో ఫోన్ ఉన్న వారు కానీ.. రహస్యంగా ఫోన్లు మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రహస్య ఫోన్లు మాట్లాడుకోవటానికి వీల్లేకుండా క్యాంపులు నిర్వహిస్తున్న దగ్గర మొబైల్ జామర్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దినపత్రికలు.. టీవీ ఛానళ్లు అందుబాటులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తంది.

క్యాంపులు నిర్వహిస్తున్న చోట.. వందలాదిగా మనుషుల్ని పెట్టించిన శశికళవర్గం.. ఎమ్మెల్యేలు ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఉన్న సిబ్బందినిఎప్పటికిప్పుడు మార్చేస్తూ.. అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారని.. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక.. క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలపై ఒక కన్నేసి ఉంచటంతో పాటు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని ఆరా తీసేందుకు హోటల్ సిబ్బందిని ప్రతి అరగంటకు ఒకసారి కాఫీలు.. టిఫిన్ల పేరుతో వెళుతున్న సిబ్బంది వారి మాటల్ని గమనించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. క్యాంపుల్లో ఉన్న కొందరు ఎమ్మెల్యేల్ని ఈ కట్టుబాట్ల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి వాటి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కొన్నిసందర్భాల్లోఈ విషయాల మీద గొడవలు కూడా జరుగుతుండటం గమనార్హం.

ఎమ్మెల్యేలకు సిద్ధం చేసిన మెనూను చూస్తే.. ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ.. వడ.. దోశ.. పొంగల్ తదితర ఐటెమ్స్ ను వడ్డించారని.. మధ్యాహ్న భోజనంలో చేపలు.. మటన్.. అన్ని రకాల కూరలు.. బిర్యానీలు.. థాలీలు.. డిజర్ట్ లు ఉండేలా జాగ్రత్తలు తీసున్నారని.. లిక్కర్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎమ్మెల్యేలకు ఏ మాత్రం అసౌకర్యం కలగని రీతిలో ఉంటున్నారని చెబుతున్నారు. అన్ని ఉన్నా.. అవసరమైన స్వేచ్ఛ లేకపోవటం.. బయట ప్రపంచంలో సంబంధాలు కోల్పోవటంపై మాత్రం కొందరు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం జీర్ణించుకోవటం లేదని తెలుస్తోంది. స్వేచ్ఛ లేనప్పుడు ఎంత సుఖం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఆ విషయం చిన్నమ్మ వర్గ ఎమ్మెల్యేలకు ఈపాటికి ఎంతోకొంత అర్థమై ఉండొచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News