అధికారం కావాలి.. అధినేత‌ నివాళికి టైం లేదా!

Update: 2016-12-24 13:28 GMT
అన్నా డి.ఎమ్‌.కె. పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎమ్‌.జి. రామ‌చంద్ర‌న్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఉన్న రామ‌చంద్ర‌న్ స్మార‌క మందిరంలో ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వ‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అన్నా డి.ఎమ్.కె. నాయ‌కులంద‌రూ బీచ్ కు చేరుకుని ఎమ్.జి.ఆర్‌.కు నివాళ్లులు ప్ర‌త్యేకంగా నివాళులు అర్పించారు. త‌మిళుల ఆత్మ‌గౌర‌వం కాపాడేందుకు ఎమ్‌.జి.ఆర్. పార్టీని స్థాపించార‌నీ, జ‌య‌ల‌లిత‌ను పార్టీని ముందుకు న‌డిపించార‌నీ ఆయ‌న అన్నారు. దాదాపు అన్నాడీఎంకే నేత‌లంద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. పార్టీప‌రంగా ఎంతో ప్రాధాన్య‌త ఉన్న ఈ కార్య‌క్ర‌మానికి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు శ‌శిక‌ళ రాక‌పోవ‌డం ఇప్పుడు త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చివ‌రికి అన్నా డి.ఎమ్‌.కె. పార్టీ నుంచి బ‌హిష్క‌ణ‌కు గురైన రాజ్య‌స‌భ స‌భ్యురాలు పుష్ఫ కూడా మెరీనా బీచ్ కు వ‌చ్చి ఎం.జి.ఆర్‌.కు నివాళులు అర్పించారు. కానీ, శ‌శిక‌ళ మాత్రం ఇక్క‌డికి రాలేదు. త‌మిళ‌నాడు అంటేనే కాస్త సెంటిమెంట్లు ఎక్కువ అంటారు. నాయ‌కులు ఫాలో అవుతున్న సెంటిమెంట్ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూ ఉంటారు. అలాంటిది, జ‌య‌ల‌లిత త‌రువాత స్థానం కోరుకుంటున్న శశిక‌ళ రాలేదంటే త‌మిళ ప్ర‌జ‌లు వేరేలా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా! ఎం.జి.ఆర్‌. స్థాపించిన పార్టీపై ఆధిప‌త్యం కావాలి... కానీ, ఆయ‌న‌కు నివాళులు అర్పించేందుకే శశిక‌ళ‌ను స‌మ‌యం లేకుండా పోయిందా అనేవి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

నివాళులు అర్పించ‌డానికి రానివారిలో శ‌శిక‌ళ‌తోపాటు ఇటీవ‌లి కాలంలో ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న కొంత‌మంది మంత్రులు కూడా ఉన్నారు! వారూ ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండ‌టం విశేషం. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న ప‌న్నీర్ సెల్వ‌మ్ వీలు క‌ల్పించుకుని ఎంజీఆర్ కు నివాళ్లు అర్పించారు, కానీ, ఖాళీ ఉన్న శ‌శిక‌ళకు మాత్రం టైం లేక‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం అని త‌మిళనాట రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇలా ఎంజీఆర్ వ‌ర్థంతికి దూరంగా ఉండ‌టం వెన‌క వేరే కార‌ణం ఏదైనా ఉందేమో మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News