తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీని శాసించాలనుకొని కలలు కని ఊహించని రీతిలో అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలులో ఉన్న శశికళ తన మెడకు మరో కేసు చుట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే చిన్నమ్మ దూకుడుకు ఈడీ బ్రేకులు వేసింది. బెంగళూరులోని జైల్లో ఉన్న శశికళ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఫెరా కేసుకు సంబంధించి విచారణ కంటే ముందే తనకు ప్రశ్నలను అందజేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దీనికి అభ్యంతరం చెప్పింది.
నిందితులకు ఇలా ముందస్తుగా ప్రశ్నలు అందించే సంప్రదాయం లేదని, ప్రత్యేక సందర్భాల్లో కూడా ఇలాంటి అవకాశం కల్పించవద్దని ఈడీ వాదించింది. ఇలాంటి అవకాశం కేసును ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ వాదనల నేపథ్యంలో కోర్టు కేసును వాయిదా వేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/