కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. అమ్మ నెచ్చెలిగా.. తమిళనాట చిన్నమ్మగా పాపులర్ అయిన శశికళకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చి.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరకుగా వ్యవహరించే శశికళ.. ఒక విషయంలో మాత్రం తన తీరుకు భిన్నంగా.. సూసైడ్ వార్నింగ్లు ఇచ్చిన వైనం బయటకు వచ్చింది.
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన అమ్మ జయలలితకు సంబంధించిన ట్రీట్ మెంట్ ఫోటోలు కానీ.. వీడియోలు కానీ బయటకు వచ్చింది లేదు. అమ్మ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైనా.. ఆసుపత్రిలో ఆమె చికిత్స నాటి ఫోటోలు మాత్రం రాలేదు. అయితే.. ఈ ఫోటోలు బయటకు రాకపోవటానికి కారణం శశికళే అని చెబుతున్నారు. రాణిలా బతికిన తన నెచ్చెలి ఫోటోలు.. ఆకుపచ్చ గౌనులో.. వైద్యుల చేత చికిత్స పొందుతున్న ఫోటోలు బయటకు రావటానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు ఆమె చాలా గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలలిత ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని తన మద్దతుదారులతో చాలా తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అమ్మ అంతిమ ఘడియలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే.. తాను సూసైడ్ చేసుకుంటానని చిన్నమ్మ మేనల్లుడు జయానంద్ దివాకరన్ చెబుతున్నారు. జైలుకు వెళ్లే ముందు కూడా.. కుటుంబ సభ్యులకు.. సన్నిహితులకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అమ్మ ఆసుపత్రి ఫోటోల విషయంలో చిన్నమ్మ ఎంత పట్టుదలగా ఉన్నారన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/