రోజా సెటైర్‌ ను..లోకేశ్ నిజం చేస్తున్నారే!

Update: 2018-07-01 14:30 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో  కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఎప్పుడు చూసినా త‌న‌ను తాను ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు. గ‌తంలో ఆయ‌న పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ కాక‌ముందు... గుట్టుగా ఎన్ని త‌ప్పులు చేసినా లోకేశ్ ను ఏ ఒక్క‌రు కూడా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే... అది ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం కాబ‌ట్టి. అయితే టీడీపీ అధినేత‌ - 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీగా చెప్పుకుంటున్న నారా చంద్ర‌బాబునాయుడు కుమారుడి హోదాలో రాజ‌కీయ తెరంగేట్రం చేసిన త‌ర్వాత కూడా గ‌తంలో మాదిరే వ‌రుస త‌ప్పులు చేసుకుంటూ పోతే... లోకేశ్ ను ఏమ‌నకుండా ప్ర‌జ‌లెందుకు ఊరికే ఉంటారు చెప్పండి. నిజ‌మే... రాజ‌కీయ నేత‌గా లోకేశ్ చేసిన ప్ర‌తి చిన్న‌ - పెద్ద త‌ప్పును భూత‌ద్దంలో చూపుతూ... ప‌లువురు ఆయ‌న వ్య‌వ‌హార స‌ర‌ళిని తూర్పార‌బ‌ట్టేస్తున్నారు. అంతేకాకుండా మొన్న‌టిదాకా కేవలం ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాలు మాత్ర‌మే ఉండేవి. ఆ రెంటితో మెజారిటీ భాగం టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేవే కావ‌డంతో లోకేశ్ చేస్తున్న‌ త‌ర‌హా త‌ప్పులు చంద్ర‌బాబు చేసినా - ఇత‌ర నేత‌లు చేసినా పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే ఇప్పుడు ఆ రెండు ర‌కాల మీడియాల‌ను ఏరి పారేసే సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇవ్వ‌డంతో టీడీపీలోని డొల్లత‌నం బాగానే బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో లోకేశ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌డం - వ‌రుస‌గా త‌ప్పులు చేసుకుంటూ పోవ‌డం - క‌నీసం మాట‌లు కూడా స్ప‌ష్టంగా  ప‌ల‌క‌లేని త‌న అవిటి త‌నాన్ని బ‌య‌ట‌పెట్టుకోవడం లాంటి ఘ‌ట‌నల‌ను సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ పోతోంది.  ఈ క్ర‌మంలో ఎక్క‌డ ఏ చిన్న కార్య‌క్ర‌మంలో అయినా లోకేశ్ నోరు జారితే... దానికి సంబంధించిన వీడియో క్ష‌ణాల్లో నెట్టింట ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. ఈ  క్ర‌మంలో లోకేశ్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు సంధించేందుకు విప‌క్షాలు భారీ అవ‌కాశాలే ల‌భిస్తున్నాయి.  ఇందులో భాగంగా మొన్న‌టికి మొన్న లోకేశ్ ప్ర‌సంగాన్ని ఆస‌రా చేసుకుని వైసీపీ ఫైర్ బ్రాండ్ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటు విమ‌ర్శ‌లు సంధించారు. గ‌తంలో త‌ప్పుల త‌డ‌క‌ల ప్ర‌సంగాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచిన లోకేశ్ ను పప్పుగా  సోష‌ల్ మీడియా అభివ‌ర్ణిస్తే... తాజాగా రోజా ఆయ‌న‌పై ఘాటు సెటైర్ సంధించారు. ప‌దాలు కూడా  స‌రిగ్గా ప‌ల‌క‌లేక‌పోతున్న లోకేశ్... ప‌ప్పు కాద‌ని - గ‌న్నేరు ప‌ప్పు అంటూ  రోజా భారీ సెటైర్ వేశారు.

అయితే రోజా సెటైర్ ను నిజం చేసేందుకేన‌న్న‌ట్లుగా కాకినాడ ధ‌ర్మ‌పోరాట దీక్షా వేదిక మీద నుంచి లోకేశ్ చేసిన ప్ర‌సంగం  మ‌రింత వైర‌ల్‌ గా మారిపోయింది. త‌న  ప్ర‌సంగంలో చాలా ప‌దాల‌ను కరెక్ట్‌ గా ప‌లికేందుకు కూడా చేత‌గాని లోకేశ్... ప్ర‌జ‌ల‌తో పాటు సొంత పార్టీ నేత‌లు - కార్య‌క‌ర్త‌ల‌కు కూడా షాకిచ్చార‌నే చెప్పాలి. ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని చెప్ప‌డానికి బ‌దులుగా ఇండియా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లతో తెలుగు త‌మ్ముళ్లు హ‌తాశుల‌య్యారని చెప్ప‌క త‌ప్ప‌దు. అభినందించాల‌న్న విష‌యాన్ని అభినిందించాలంటూ  లోకేశ్ చేసిన మ‌రో కామెంట్ అయితే నిజంగానే వైర‌ల్ గా మారిపోయింది. త‌న ప్ర‌సంగంలో చాలా ప‌దాల‌ను ఇలాగే త‌ప్పుగా  ప‌లికిన లోకేశ్... నిజంగానే త‌న  ప్ర‌సంగంలో ఏమాత్రం మార్పు రాద‌ని, తాను ఇంతేన‌ని తేల్చి చెప్పిన‌ట్టైంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అంటే చిన‌బాబును మార్చ‌డం ఇప్పుడు ఏ ఒక్క‌రి వ‌ల్లా కాద‌న్న మాట‌. ఇలాగైతే మున్ముందు లోకేశ్ ఇంకెన్నీ సెటైర్ల‌కు కేంద్ర బిందువ‌వుతారో చూడాలి.

Tags:    

Similar News