వైసీపీలో చేరికపై సతీష్ రెడ్డి మౌనం దేనికి సంకేతం !

Update: 2021-07-21 08:02 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వైసీపీ లో చేరడం పై మాజీ ఎమ్మెల్సీ , క‌డ‌ప జిల్లా టీడీపీ కీలక మాజీ నేత ఎస్వీ స‌తీష్‌రెడ్డి వెన‌క్కి త‌గ్గిన‌ట్టు వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. వైఎస్ కుటుంబానికి సొంత నియోజకవర్గమైన పులివెందుల‌లో వైఎస్ కుటుంబంపై స‌తీష్‌ రెడ్డి సుదీర్ఘ‌కాలంగా రాజకీయ పోరాటం సాగిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ తో పాటు ఆయ‌న త‌న‌యుడు, ప్ర‌స్తుత ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై స‌తీష్‌ రెడ్డి పోటీ చేసిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. అయితే , సతీష్ రెడ్డి ఏనాడూ కూడా వైఎస్ కుటుంబం పై గెలిచిన దాఖలాలు లేవు. గెలుపోట‌ముల‌తో నిమిత్తం లేకుండా టీడీపీ అధిష్టానం ఆదేశాల‌ను పాటిస్తూ వైఎస్ కుటుంబంపై ఎన్నిక‌లలో స‌తీష్‌ రెడ్డి త‌ల‌ప‌డుతూ అనేక క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓర్చుకుంటూ వచ్చారు.

ఇక, 2019 లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొన్ని రోజులకి స‌తీష్‌ రెడ్డి టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా న‌మ్మిన వాళ్ల  కోసం వైఎస్ కుటుంబం అండ‌గా నిలుస్తుంద‌ని ప్రశంసలు కురిపించారు.  వైఎస్ కుటుంబం పై ఏకంగా స‌తీష్‌ రెడ్డి పొగడ్తలు కురిపించడం తో అయన వైసీపీలో చేర‌డం ఖ‌రారైంద‌ని, ఇక జ‌గ‌న్ కండువా క‌ప్ప‌డం ఒక్క‌టే మిగిలింద‌నే ప్ర‌చారం రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. అయితే , ఆ ప్రచారం సాగినా తర్వాత రోజులు , నెలలు గడిచిపోతున్నాయి కానీ సతీష్ రెడ్డి మాత్రం వైసీపీ గూటికి చేరలేదు. మ‌రోవైపు స‌తీష్‌ రెడ్డి వ్య‌వ‌సాయంతో పాటు ఖ‌మ్మం జిల్లాలో కాంట్రాక్ట్ ప‌నులు చేసుకుంటున్నార‌ని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.

అలాగే, అయన ప్రస్తుత రాజ‌కీయాల‌పై మాట్లాడేందుకు ఆయ‌న నిరాస‌క్త‌త చూపుతున్నార‌ని స‌మాచారం. అయితే , సతీష్ రెడ్డి వైసీపీ లో జాయిన్ కాకపోవడానికి ముఖ్య కారణం  పార్టీలో చేరితే త‌న పొజీషిన్ ఏంట‌నేది చెప్ప‌క పోవ‌డం వ‌ల్లే ఆయ‌న పార్టీలో చేరేందుకు వెనుకాడుతున్నార‌ని స‌మాచారం. మ‌రో వైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డికి ఏ మాత్రం విలువ ఇవ్వ‌లేద‌నే స‌మాచారం. ఈ విషయం కూడా స‌తీష్‌ రెడ్డిని వైసీపీ వైపు అడుగులు వేసేందుకు అడ్డుక‌ట్ట వేసిన‌ట్టు తెలుస్తోంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిని అధికార పార్టీ ముఖ్య‌నేత‌లు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే ప్ర‌చారం క‌డ‌ప జిల్లాలో విస్తృతంగా సాగుతోంది.దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాను వెళ్లినా అదే ప‌రిస్థితి పున‌రావృతం అవుతుంద‌నే ఆందోళ‌న స‌తీష్‌ రెడ్డిని వైసీపీలో చేరేందుకు నిలువ‌రిస్తోంది. అలాగే, రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతుందనే ప్రచారం కూడా, ఆ పార్టీలో చేరిక‌ పై స‌తీష్‌ రెడ్డి ఆలోచనలో ప‌డ్డార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు.
Tags:    

Similar News