ఒక భవనం మహా అయితే ఎంత ఉంటుంది? ఒక కిలోమీటరు విస్తీర్ణంలో అనుకుందామా? అంటే.. అసలు అలాంటిది ఉంటుందా? అన్న సందేహం మీకు రావొచ్చు. కానీ.. సౌదీ అరేబియా దానికి మించి ఆలోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించిన సౌదీ అరేబియా తాజాగా ఒక భారీ ప్రాజెక్టుకు తెర తీసింది. ఇలాంటి ఆలోచనల్ని సౌదీ తప్పించి మరెవరూ చేయలేరేమో? ఎందుకంటే.. సౌదీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్న భారీ జంట కట్టడాల విస్తీర్ణమే మైళ్లకు మైళ్ల దూరానికి విస్తరించి ఉండనుంది.
సింపుల్ గా చెప్పాలంటే.. సదరు జంట భవనాల విస్తీర్ణం మైళ్లకు మైళ్లు విస్తరించి ఉండనుంది.ఇంతకాలం కట్టడాల ఎత్తుతో అద్భుతాన్ని ఆవిష్కరించిన సౌదీ.. ఇప్పుడు వెడల్పుతో మరో అద్భుతాన్ని క్రియేట్ చేయనుంది. దీని వెడల్పు ఎవరి అంచనాలకు అందనంత భారీగా ఉంటుందని చెబుతున్నారు.
భవన నిర్మాణంలో బాహుబలి నిర్మాణమన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సౌదీ పెట్టనున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 50వేల కోట్ల డాలర్లు. డాలర్ అంటే ఒక్కొక్కటి 77.59 పైసలు ఉంది ఈ రోజు రేటు ప్రకారం. దాన్ని రూ.77 లెక్కన గుణిస్తే.. వచ్చే మొత్తం మన కేంద్ర వార్షిక బడ్జెట్ కు మించి ఉండనుంది.
అంటే.. ఒక దేశ వార్షిక బడ్జెట్ కు మించిన మొత్తాన్ని సౌదీ అరేబియా జంట భవనాల్ని నిర్మించటానికి ఖర్చు చేస్తుందంటే ఇంకేమనాలి? ఈ బాహుబలి భవనాల ఎత్తు బుర్జ్ ఖలీఫా కంటే తక్కువే ఉండనుంది. బుర్జ్ ఖలీపా ఎత్తు 829.8 మీటర్లు ఉంటుంది.
ఈ బాహుబలి భవనం ఎత్తు మాత్రం 500 మీటర్లు మాత్రమే ఉంటుంది కానీ.. వెడల్పు మాత్రం ఒక ఊరికి మించినంత స్థాయిలో ఉండనుంది. మరి.. ఇంత భారీ భవనాన్ని ఎవరు నిర్మిస్తున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే.. ఇంకెవరు.. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నిర్మిస్తున్నారు.
ఆయన కలల నగరంగా అభివర్ణించే నియోమ్ లో దీన్ని నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో స్టార్ వార్స్ లోని వకాండా తరహాలో నిర్మితమవుతున్న ఆర్టిఫిషియల్ స్మార్ట్ సిటీగా అభివర్ణిస్తున్నారు. ఈ నగరాన్ని మహానగరంగా మార్చేయటమే కాదు.. ఇంజనీరింగ్.. ఆర్కిటెక్చర్ అద్భుతంగా మార్చేసి.. కేవలం ఈ జంట భవనాల్ని చూసేందుకు యావత్ ప్రపంచం వచ్చేలా నిర్మించనున్నట్లు చెబుతున్నారు. నియోమ్ నగరం ఎర్ర సముద్రం తీరంలో 170 కిలోమీటర్ల పొడవున కడుతున్నారు. ఈ నగరానికి ఇప్పుడు నిర్మించనున్న భారీ జంట భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.