ప్రపంచం మొత్తం డిజిటలీకరణ సాగుతున్నా.. అరబ్ దేశాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పక తప్పదు. సంపదకు ఏమాత్రం కొదవ లేకున్నా.. మహిళల స్వేచ్ఛ విషయంలోనూ..వారికి విధించే ఆంక్షలవిషయంలో నేటికీ పలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. నేటికీ.. డ్రైవింగ్ చేయటం.. ఎక్సర్ సైజులు చేయటం లాంటి విషయాల్లో ఆంక్షలున్నాయి.
కాలం గడుస్తూ.. ప్రపంచం మొత్తం మారుతున్నాఅరబ్ దేశాల్లోని పరిస్థితుల్లో మాత్రం ఎంతకూ మార్పు రాని వైనం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ.. అనూహ్యంగా సౌదీ యువరాణి రీమా బాంద్ సంచలన నిర్ణయాన్నితీసుకున్నారు. శారీర వ్యాయామం లేని కారణంగా సౌదీలోని మహిళలు ఓబెసిటీకి గురి కావటమే కాదు.. పలు వ్యాధులతో అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన సౌదీ యువరాణి.. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారని చెప్పాలి.
మహిళలు ఎక్సర్ సైజులు చేయటం పైన ఆంక్షలు ఉండటం..టైట్ వస్త్రాల్నివినియోగించే విషయంలో ఉన్న ఆంక్షల నేపథ్యంలో..వాటిని ధరించిన తర్వాతే ఎక్సర్ సైజులు చేసే అవకాశం ఉండటంతో..యువరాణి ఆదేశాలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. టైట్ డ్రెస్సుల్ని వాడే విషయంలో ఇప్పటికే ఉన్న ఆంక్షలు.. యువరాణి వారి ఆదేశంతో మారిపోతాయా?అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.సౌదీచట్టాలా? సౌదీ యువరాణి ఆదేశాలా? ఏవి.. అమల్లోకి వస్తాయన్నది కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/