మోడీషాల నుంచి దేశాన్ని కాపాడండి

Update: 2019-12-14 09:29 GMT
ప్రతిపక్ష కాంగ్రెస్ జూలు విదిల్చింది. ప్రతిపక్షంలో ఉంటూ అధికార బీజేపీపై పోరాంట చేయకుండా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆ పార్టీ తాజాగా దేశాన్ని కుదేలు చేస్తున్నారని మోడీషాలను ఎండగట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది.. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ‘ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని.. 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆకలి కేకలు వినిపిస్తున్నాయని ప్రియాంక నిప్పులు చెరిగారు.

ఇప్పటికే దేశ ఆటోమొబైల్ రంగాన్ని మోడీ సర్కారు కుదేలు చేసిందని జీఎస్టీ సహా నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టిందని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ఆర్థికమంద్యంతో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారని.. ఆరేళ్లలో మోడీ ఉద్యోగ కల్పన చేయలేదని విమర్శించారు. జీఎస్టీతో వ్యాపారులు దివాళా తీశారని.. రైతులు ఇతర వర్గాలు రోడ్డెక్కుతున్నారని విమర్శించారు.

ఇక భేటి పడావో భేటి బచావో అని మోడీ నినదిస్తున్నారని.. కానీ దేశంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ప్రియాంకగాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

ఇక అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ.. ‘తనను రాహుల్ సావర్కార్ అంటున్న వారికి సమాదానం ఇచ్చాడు. తాను రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని.. ప్రజాస్వామ్యాన్ని మోడీ ఖూనీ చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ దెబ్బతీశారని.. దాన్ని పార్లమెంట్ లో చర్చించకుండా తను చేసిన విమర్శలపై చర్చిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Tags:    

Similar News