రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంక్ ..ఎస్ బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనిల్ అంబానీ పైన దివాలా చర్యలకు అనుమతిస్తూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ జారీ చేసిన ఆదేశాల పై ఆగస్ట్ 27న బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే , ఈ స్టే ఎత్తివేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్ బిఐ తన పిటిషన్ లో పొందుపరిచింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని, సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకు కు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని ఎస్ బీఐ కోర్టుకి తెలిపింది. అడాగ్ గ్రూప్ కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ తీసుకున్న కార్పోరేట్ రుణాలపై అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారడంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుండి ఈ మొత్తం రాబట్టాలని ఎస్బీఐ నిర్ణయించింది.
కార్పోరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ ను నియమించాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది బ్యాంకు. ఇక్కడ ఎస్బీఐకి ఊరట లభించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బాంబే హైకోర్టులో తాత్కాలిక స్టే పడింది. ఈ స్టేను రద్దు చేయాలని ఎస్ బి ఐ సుప్రీంను ఆశ్రయించింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్ లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడిని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఐబీబీఐ, ఎస్ బీఐలకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది.