ప్రభుత్వాల 'ఉచితాల' పై ఎస్బీఐ ఆందోళన

Update: 2022-04-19 10:30 GMT
వివిధ రాష్ట్రాల్లో  ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక నివేదికను రిలీజ్ చేసింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలు, అధికారంలోకి రావటానికి పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల వల్ల దేశం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని తాజా నివేదకలో ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో దేశంలో ఆర్ధిక విపత్తు తలెత్తే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కోవిడ్ మహమ్మారి కారణంగా దేశం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్ధంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్ధికంగా ఇబ్బందులెదుర్కొంటున్నట్లు నివేదిక చెప్పింది. తెలంగాణా, అరుణాచల్ ప్రదేశ్, ఏపీ, తమిళనాడు, బీహార్, ఝార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆదాయంలో 5-19 శాతాన్ని రుణమాఫీ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఇక్కడే నివేదికలోని అంశం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా  ఏపీలో రుణమాఫీ పథకం అయితే ఏమీ అమలు కావడం లేదు. మరి ఎస్బీఐ తన నివేదికలో ఏపీలో రుణమాఫీ పథకం అమలవుతున్నట్లు ఎలా చెప్పిందో.

రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయంలో 53 శాతాన్ని ఉచితాలకు ఖర్చుపెడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణాలో అయితే రాష్ట్ర రెవెన్యూ లో 35 శాతం ప్రజాకర్షక పథకాలకు ఖర్చు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. మళ్ళీ ఏపీలో ఎంత శాతం ఖర్చవుతుందో మాత్రం చెప్పలేదు.

2021-22 సంవత్సరంలో 18 రాష్ట్రాల్లో ద్రవ్యలోటు 4 శాతానికి పెరిగినట్లు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాకర్షక పథకాలు దీర్ఘకాలంలో ప్రభుత్వా ఆర్థిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్బీఐ హెచ్చరించింది.

కొన్ని రాష్ట్రాల్లో ఆర్ధిక పరిస్ధితి ఘోరంగా ఉన్నా అప్పులు చేస్తు ప్రజలకు పంచి పెడుతున్నట్లు చెప్పింది. బహుశా ఏపీలో జరుగుతున్నట్లే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతోందేమో. ప్రత్యేకించి ఏపీ అని చెప్పకపోయినా ఇలాంటి రాష్ట్రాలు ఎన్నున్నాయో చెబితే బాగుండేది.
Tags:    

Similar News