మ‌న‌కు షాకిచ్చి ఉద్యోగుల‌కు ఎస్‌ బీఐ గుడ్ న్యూస్‌

Update: 2017-03-12 11:04 GMT
డ‌బ్బులు వేసినా చార్జీలు - తీసినా చార్జీలే అని ప్ర‌క‌టించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుల‌ను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టిన సంగతి  తెలిసిందే.  బ్యాంకు తీరుపై కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ చార్జీల పెంపు వంద‌శాతం క‌రెక్టేన‌ని ఎస్బీఐ చీఫ్ అరుందతి భ‌ట్టాచార్య తేల్చిచెప్పారు. వినియోగ‌దారుల విష‌యంలో ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన ఎస్‌ బీఐ...త‌న ఉద్యోగుల విష‌యంలో మాత్రం పెద్ద మ‌న‌సు చాటుకుంది. ఇంటి నుంచి పనిచేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తూ ఎస్‌ బీఐ నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ను ఉపయోగించి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలు కల్పించే ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ విధానానికి ఎస్‌ బీఐ బోర్డు ఇటీవలే ఆమోదం తెలిపింది.

ఎస్‌ బీఐ తాజాగా ఆమోదించ‌న ప్ర‌కారం మొబైల్‌ కంప్యూటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేసుకోవ‌చ్చు. ఇందులో భాగంగా అందరి ఉద్యోగుల మొబైళ్లను కేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. డాటా, అప్లికేషన్లకు భద్రత పరంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రత్యేక వ్యవస్థ(ఎమ్‌ ఐఎస్‌) ద్వారా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. దీని వల్ల ఉద్యోగులు సత్వరం ఏదైనా పనిచేయాల్సి వచ్చినపుడు ఇంటి నుంచి పని ప్రదేశానికి పరుగులు పెట్టకుండా.. కూర్చున్న చోటు నుంచే ఆ పనిని పూర్తి చేసేందుకు వీలవుతుందని బ్యాంకు తెలిపింది. భవిష్యత్‌ లో మార్కెటింగ్‌ - సీఆర్‌ ఎమ్‌ - సోషల్‌ మీడియా మేనేజ్‌ మెంట్‌ - సెటిల్‌ మెంట్‌ - ఫిర్యాదు నిర్వహణ తదితర పనులకూ ఇంటి నుంచే పనిచేసేలా వీలు కల్పించాలని బ్యాంకు భావిస్తోంది. తద్వారా ఉద్యోగి ఉత్పాదకతను ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని అంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News