ప్రముఖ సినీ నిర్మాత తెలుగు ప్రజలకు సుపరిచితులైన ప్రముఖుల్లో బండ్ల గణేశ్ ఒకరు. ఆ మధ్య టాప్ హీరోలతో వరుసపెట్టి మరీ సినిమాలు తీసిన బండ్ల గణేశ్ వైనం హాట్ టాపిక్ గా ఉండేది. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. అగ్రహీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన బండ్ల.. కొంత కాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.
సినిమాలు నిర్మించకున్నా.. సినీ వ్యవహారాల విషయంలో చురుగ్గా ఉండే ఆయన.. కొద్ది కాలంగా తమ ఫ్రౌల్టీ బిజినెస్ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. మరికొంత కాలం వ్యాపారం మీద దృష్టి సారించి.. మళ్లీ సినిమాలు తీస్తానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో బండ్ల వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. బండ్ల గణేశ్.. ఆయన సోదరుడు శివబాబుపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
భూముల కొనుగోలు విషయంలో చోటు చేసుకున్న వివాదం పెరిగి పెద్దదై.. కేసుల వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రను.. ఆయన సతీమణిని బండ్ల గణేశ్.. ఆయన సోదరుడు కులం పేరుతో దూషించినట్లుగా కేసు నమోదైనట్లుగా చెబుతున్నారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వెనుక ఉన్న వివాదం చూస్తే.. షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం.. బూర్గుల శివారులో భూములు.. ఫౌల్ట్రీలు ఉన్నాయి. వాటిని బండ్ల గణేశ్.. సోదరుడు కలిసి కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఆస్తులపై ఉన్న బ్యాంక్ లోన్ ను చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. సేల్ అగ్రిమెంట్ లో భాగంగా తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్ చంద్ర.. ఆయన సతీమణి కమ్ కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి బూర్గుల శివారులో ఉన్న బండ్ల గణేశ్ ఫౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తమను తిట్టారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బండ్ల బ్రదర్స్ పై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై బండ్ల గణేశ్.. ఆయన సోదరుడు స్పందించాల్సి ఉంది.