సుప్రీం తీర్పుతో పెళ్లి ప‌విత్ర‌త‌కు క్వ‌శ్చ‌నా?

Update: 2018-09-28 04:34 GMT
సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎవ‌రైనా మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉండి ఉంటే.. అది ఎంత మాత్రం నేరం కాదంటూ ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి.

పెళ్లి చేసుకోండి.. అదే టైంలో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకోండ‌న్న‌ట్లుగా తీర్పు ఉంద‌న్న మాట‌ను ఆమె చెప్పారు. వివాహేత‌ర సంబంధాల‌పై దేశ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగంగా లైసెన్స్ ఇచ్చిన‌ట్లేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌న్న ఆమె.. ఈ తీర్పును తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని చెప్పారు

తాజా తీర్పుతో పెళ్లి ప‌విత్ర‌త అన్న‌ది ఇంకేం ఉంటుంద‌ని ప్ర‌శ్నించిన ఆమె.. సుప్రీంతీర్పు బ‌హుభార్య‌త్వాన్ని కూడా స‌మ‌ర్థిస్తుందా? అన్న క్వ‌శ్చ‌న్ వేశారు. తాజా తీర్పుకు సంబంధించిన ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేసిన రేణుక‌.. బ‌హుభార్య‌త్వాన్ని తాజా తీర్పు స‌మ‌ర్థిస్తుందా? అన్న సందేహాన్ని తీర్చాల‌ని ఆమె కోరుతున్నారు.

రేణుక త‌ర‌హాలోనే సుప్రీం తాజా తీర్పును ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లీవాల్ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వివాహేత‌ర సంబంధాలు నేరం కాదంటున్నార‌ని.. అయితే.. ఈ తీర్పు మ‌హిళ‌ల‌కు ఎలాంటి మేలు చేస్తుందో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌ని రేణుక వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై మ‌హిళా ప్ర‌ముఖులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న వైనం ఇప్పుడు ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. మ‌రి.. వీటిపై సుప్రీం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది..?


Tags:    

Similar News