‘జీ’ అంటే?; వారి పిల్లలకు కొత్త పేరు పెట్టేశారు

Update: 2016-07-18 22:30 GMT
ఆడ.. మగ.. ఓకే.  మరి.. ట్రాన్స్ జెండర్ పిల్లల్ని ఎలా వ్యవహరించాలి? వారిని ఏ పేరు పెట్టి పిలవాలి? అన్న సందేహానికి సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. అతడు.. ఆమె అన్న రెండు వర్గాలతో పాటు ప్రత్యేక వర్గానికి ఒక పేరును పెట్టాలన్న డిమాండ్ కు తగ్గట్లే కొత్త పేరును డిసైడ్ చేశారు. ట్రాన్స్ జెండర్లను ఈజీగా గుర్తించేందుకు వీలుగా ‘‘జీ’’ (ZIE) గా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఈ పదాన్ని తాము ఓకే చేసినట్లుగా యూకే బోర్డింగ్ స్కూల్స్ అసోసియేషన్ తమ టీచర్లకు వ్యవహరించినట్లు అక్కడి మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. తమను బాయ్.. గర్ల్ గా వ్యవహరించొద్దంటూ ట్రాన్స్ జెండర్ పిల్లలు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి ఒక పేరు పెట్టాల్సి వచ్చింది. ఇక.. జీ అనే పదానికి అర్థం వెతికితే.. లింగ భేదం లేని సర్వనామంగా చెబుతున్నారు. తాజా మార్గదర్శకాలతో బ్రిటన్.. యూరప్ లలోని టీచర్లు అందరూ ట్రాన్స్ జెండర్ పిల్లల్ని ఇకపై ‘జీ’ అనే పేరుతో వ్యవహరించనున్నారని చెప్పొచ్చు. మరి.. బ్రిటన్ లో మొదలైన ఈ పిలుపు ప్రపంచ ఆమోదాన్ని పొందుతుందో లేదో చూడాలి..?
Tags:    

Similar News