లాక్ డౌన్ ఎఫెక్ట్ : స్కూల్స్ రీ ఓపెన్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...!
కరోనా వైరస్ ..ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తుంది. మొదట్లో తక్కువ కేసులు నమోదు అయిన కూడా , ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగి పోతుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 303 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 72 కేసులు నమోదు అయ్యాయి.
ఈ సంగతి పక్కన పెడితే .. కరోనాను అరికట్టడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి చేసేందుకు తదుపరి కార్యాచరణలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినా లేదా సడలించినా కూడా రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఒకవేల లాక్ డౌన్ ఎత్తివేస్తే .. పాఠశాలలు తెరిస్తే విద్యార్ధులు అందరూ గుమిగూడతారు కాబట్టి, మళ్లీ కరోనా విజృంభించే అవకాశమే ఎక్కువగా ఉంది. దీనితో స్కూల్స్ మూసివేయడమే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోందట.
ఈ లాక్ డౌన్ లేకపోయింటే అకాడిమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. ఒకవేళ ఈ నెల 14 తర్వాత తెరిచినప్పటికీ , ఆదివారాలు పోనూ కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాగే ఇప్పటికే 9వ తరగతి వరకు విద్యార్ధులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రోమోట్ చేసారు కాబట్టి.. జూన్ 11వ తేది వరకు స్కూళ్లను మూసి వేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి ఏపీలో కొత్త అకాడమిక్ ఇయర్ లోనే తెరచుకోనున్నాయి.