ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. వెయ్యి మందికి పైగా ప్రజలను పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి.....40 వేలకు పైగా ప్రజలను పట్టి పీడిస్తోంది. మరో రెండు మూడు నెలల్లో ఈ వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కరోనాను నిర్మూలించేందుకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ కావాలంటే....మరో 18 నెలలు వెయిట్ చేయాల్సిందేనని డబ్ల్యూహెచ్ వో చెబుతోంది. ఇలా కరోనాపై ప్రపంచమంతా ఫోకస్ చేస్తున్న వేళ....బ్రెజిల్ ప్రజలను ఓ సరికొత్త వైరస్ కలవర పెడుతోంది. బ్రెజిల్ లోని ఓ కత్రిమ సరస్సులో పుట్టిన `యారా` వైరస్ గురించి బ్రెజిల్ వాసులు బెంబేలెత్తుతున్నారు.
బ్రెజిల్‌లోని ఓ కత్రిమ సరస్సు నీటిలో నివసిస్తోన్న అమీబాలో ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు కనుగొన్న వైరస్‌లకు ఈ వైరస్ కు ఎలాంటి పోలిక లేదు. అందుకే ఈ వైరస్ కు బ్రెజిల్ పురాణంలోని మత్స్యకన్య ‘యారా’ పేరు పెట్టారు. ఈ వైరస్‌లోని 74 జన్యువుల్లో 68 జన్యువులను ఏ వైరస్ లో చూడలేదంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ సైంటిఫిక్ డేటాలోని 8,500 రకాల జన్యువులతోనూ ఈ వైరస్ జన్యువులు సరిపోలకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
సముద్ర జలాలు విపరీతంగా కలుషితం అవుతుండడం వల్ల గత మూడేళ్లలో వైరస్ లు పెరిగిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏకకణ జీవి అయిన అమీబాల్లోనే ఈ వైరస్ కనిపిస్తోందని - కాబట్టి మనుషులకు సోకే ప్రమాదం ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.