మనిషిలో కొత్త అవయువాన్ని కనిపెట్టేశారు

Update: 2017-01-05 04:55 GMT
శాస్త్ర.. సాంకేతిక రంగం ఎంతో ముందుకెళ్లినట్లుగా చెప్పుకునే వేళ.. మనుషులంతా ఒక్కసారి విస్మయానికి గురి చేసే అంశం ఒకటి ఆవిష్కృతమైంది. ఇంతకాలం మనిషి లోపలి భాగంగా ఉన్నప్పటికీ.. దాన్నో అవయువంగా గుర్తించని శాస్త్రవేత్తలు ఇప్పుడా అంచనా తప్పని తేలిపోయింది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా.. మనిషి అవయువాల్లో కొత్తది వచ్చి చేరింది.

దీంతో.. ఇప్పటివరకూ వైద్య విద్యార్థులకు పాఠాలుగా చెబుతున్నా శరీర నిర్మాణ శాస్త్రాన్ని తిరిగి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తి కడుపు.. పేగును కలిపి ఉంచి ఈ అవయువాన్ని మెసెంటరీగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకూ జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయువాల్లో దీన్నో భాగంగానే భావిస్తున్నారు. కానీ.. ఇదో ప్రత్యేకమైన అవయువంగా ఐర్లాండ్ కు చెందిన వైద్య శాస్త్రవేత్త కెల్విన్ కొఫె వెల్లడించారు.

యూనివర్సిటీ ఆఫ్ లైమ్ రిక్ కు చెందిన ఈ శాస్త్రవేత్త వాదన ప్రకారం.. మెసెంటరీని కొత్త అవయువంగా గుర్తించటం ద్వారా.. జీర్ణ వ్యవస్థ వ్యాధులపై కొత్త కోణం బయటకు వచ్చినట్లేనని చెప్పొచ్చు. ఈ అవయువంపై దృష్టి సారించటం ద్వారా.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు కోత పెట్టే చర్యల్ని తగ్గించటంతోపాటు.. తక్కువ ఖర్చుతోనే పూర్తి అయ్యే వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే వీలుంది. జీర్ణవ్యవస్థలో పసుపుపచ్చగా ఉండే ఈ భాగాన్ని రానున్నరోజుల్లో కొత్త అవయువంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణగా చెబుతున్న ఈ అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News