డైనోసార్ జాతి కోసం మొదలైన అన్వేషణ

Update: 2018-05-31 23:30 GMT
దాదాపు 5 లక్షల ఏళ్ల క్రితం ఈ భూమ్మీద డైనోసార్లు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇప్పటికీ డైనోసార్ల అవశేషాలు మనకు అక్కడక్కడా కనిపిస్తాయి.. భూమి మీద పడ్డ భారీ గ్రహశకలం ధాటికి సునామీలు, భూకంపాలు, అగ్రిపర్వతాలు చోటు చేసుకొని డైనోసార్ల జాతి అంతమైందనే వాదన ఉంది. చాలా తెలివిగల  ఆ జంతువులు గనుక బతికి ఉంటే ఇప్పుడు మానవ మనుగడ ఇంత సాఫీగా సాగి ఉండేది కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే డైనోసార్ల జాతి అంతిమైనా అచ్చం అలాంటి పోలికలతో కొన్నేళ్ల క్రితం స్కాట్కాండ్ దేశం చుట్టుపక్కల  ద్వీపాల్లోని సరస్సుల్లో ఓ జీవి ఉండేది. ఈ జీవి సరస్సు అట్టడుగు భాగాల్లో జీవిస్తుండేదని స్కాట్లాండ్ వాసులు చెప్పేవారు. అ అద్భుత జీవి పేరు ‘లాస్ నెస్ మాన్ స్టర్’. ‘నెస్సీ’ అని ముద్దుపేరుతో స్కాంట్లాండ్ వాసులు పిలుస్తారు. ఇదో నీటి జంతువు. పొడవాటి మెడ - తాబేలు లాంటి మొండెం  - శాఖాహార డైనోసార్ లాంటి ఆకారంతో ఈ జీవిని చూశామని చాలామంది స్కాట్లాండ్ వాసులు కొన్నేళ్ల క్రితం వరకు చెప్పేవారు..

అయితే ఇప్పుడా జీవి వేట, ఇతర కారణాల వల్ల ద్వీపంలో కనిపించడం లేదట.. అంతరించిపోయిన జాతుల్లో చేరింది. అయితే నెస్సీ గురించి నిగ్గుతేల్చాలని న్యూజిలాండ్ దేశానికి చెందిన నీల్ జెమెల్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓ బృందం అన్వేషణకు బయలు దేరుతోంది. బృందం నాయకుడు జెమెల్ మాట్లాడుతూ.. ‘తనకు నెస్సీ ఉనికి సంబంధిత విషయాలపై నమ్మకం లేదన్నారు. ప్రజలకు దీని గురించి అవగాహన కల్పించడానికి.. నెస్సీ గురించి నిజాలు నిగ్గుతేల్చడానికి ఈ ప్రయాణం తోడ్పడుతుందన్నారు. ఇది నీటిలో తిరిగినప్పుడు నెస్సీ శరీరంలో ఉన్న డీఎన్ ఏను ఆ నీటిలో విడిచిపెడుతుందని.. డీఎన్ ఏ ఆధారంగా ఆ జీవి జన్యు  సమాచారాన్ని తెలుసుకుంటానని ఆయన తెలిపారు. సరస్సుల్లోని వివిధ లోతుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్ లకు పంపి ఆ నీటిలో నివసించిన నెస్సీ ఉనికి తెలుసుకుంటానని తెలిపారు.  

అయితే నెస్సీ ఒకప్పుడు ఉండేదని స్కాట్లాండ్ వాసులు చెబుతుంటారు. హాలీవుడ్ లో ఇప్పటివరకు నెస్సీకి సంబంధించిన చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో చాలా సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి.
Tags:    

Similar News