టీకా ఎలా వైర‌స్‌ను హ‌రిస్తుంది..? ‌టీకాల ప్ర‌యోగాలు ఎలా..?

Update: 2020-07-25 17:30 GMT
మాన‌వ ప్రపంచాన్ని స్ట్రెచ‌ర్‌పైకి ఎక్కించిన మహమ్మారి ఎంతో మందిని మరణం పై కూర్చోపెట్టింది. ఇప్పుడు ఆ వైర‌స్ తీవ్ర‌రూపం దాలుస్తూ భార‌త‌దేశంతో పాటు అన్ని దేశాల్లో క‌ల్లోలం రేపుతోంది. ఆ వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఈ ‌క్ర‌మంలో కొన్ని వ్యాక్సిన్లు సిద్ధ‌మ‌య్యాయి. కానీ అవి ఇంకా ప్ర‌యోగాల ద‌శ‌ల్లోనే ఉన్నాయి. కొన్ని మూడు ద‌శ‌ల ప్ర‌యోగాలు పూర్తి చేసుకుని మార్కెట్‌లోకి విడుద‌ల కావ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌లో 25 పొటెన్షియల్ వైరస్ వ్యాక్సిన్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వాటిలో భార‌త‌దేశానికి సంబంధించిన రెండు.. మూడు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి.

టీక్ రీసెర్చ్ సెంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్.. బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా భాగస్వామ్యంతో ఓ వ్యాక్సిన్ త‌యారుచేస్తున్నారు. దీనికి సంబంధించిన టీకా ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల ప్ర‌యోగాలు పూర్తి చేసుకుని వచ్చే వారం 3వ దశ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో అస‌లు వ్యాక్సిన్ ప్ర‌యోగాలు ఎలా చేస్తారు..? ఒక‌వేళ ఆ వ్యాక్సిన్ విజ‌య‌వంత‌మైతే ఎలా ప‌ని చేస్తుంది అనే దానిపై ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు వివ‌రంగా తెలిపారు.

వాస్త‌వంగా టీకా మెసెంజర్ RNA (mRNA) ను ఉపయోగించి ప్రోటీన్లను నిర్మించే కణాలను ఉత్పత్తి చేస్తారు. వైరస్ స్పైక్ ప్రోటీన్‌ను నిర్మించడానికి అవసరమైన ప్రోటీన్లను మానవ కణాలకు సోకడానికి ఉపయోగిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు వైరస్ దాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని వ్యాక్సిన్ ద్వారా అందిస్తుంది. ఎందుకంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌నే మన శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉంటే చాలు ఆ వైర‌స్ హ‌రించిపోతుంది. రోగ నిరోధక శ‌క్తి ప్రతిస్పందనను ప్రేరేపించి వైర‌స్ నిర్మూల‌న‌కు గుర‌వుతుంది.

ఈ టీకా ప్ర‌యోగంలోని మొద‌టి ద‌శ‌లో సగానికి పైగా ఇంజెక్షన్ చేసిన చోట.. అలసట.. చలి.. తలనొప్పి.. కండరాల నొప్పి వంటి దుష్ప్రభావాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మూడో ద‌శ ట్రయల్ చేస్తున్నారు. ఈ మూడో ద‌శ‌లో 100 మైక్రో గ్రాములు (µg) మోతాదు వైర‌స్ రోగుల‌కు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరం లోపల ఏమి జరుగుతుంది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

మానవ జన్యువు DNAతో తయారైన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీన్ని డబుల్ స్ట్రాండెడ్ అణువుగా పిలుస్తారు. మన శరీరం ప్రోటీన్లను తయారుచేసే విధానం ఏమిటంటే.. న్యూక్లియోటైడ్లతో తయారు చేసిన DNA టెంప్లేట్. దీన్ని ట్రాన్సిస్క్రిప్ష‌న్ అని పిలుస్తారు. ఆర్ఎన్ఏ టెంప్లెట్‌ను తయారుచేయడానికి డీఎన్ఏ టెంప్లెట్‌ను ఉపయోగిస్తుంది. ఆర్ఎన్ఏ అనేది కణాల పనితీరుకు అవసరమైన ప్రోటీన్లను తయారుచేయడానికి మన శరీరంలో సాధారణంగా ఉపయోగించే టెంప్లేట్ లాంటిది. ఆర్ఎన్ఏను నేరుగా కండరాల కణంలోకి ప్రవేశ పెట్టినప్పుడు.. వ్యాక్సిన్‌గా ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఆర్‌ఎన్ఏ కణంలోని సైటోప్లాజంలోకి వెళ్తుంది.

అది ప్రోటీన్ తయారు చేయడానికి రైబోజోమ్‌లకు మారుతుంది. దీనికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇస్తారు. అప్పుడు ఒక ప్రోటీన్‌ను సృష్టించి ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రోటీన్ కండరాల కణంపై కూర్చుంటుంది. వైరస్ మీద కూర్చొని ఉండే ప్రోటీన్‌లాగా కనిపిస్తుంది. అక్కడే రోగ నిరోధక వ్యవస్థ దీనిని గుర్తిస్తుంది. ఈ ప్రోటీన్ పై వేర్వేరు ఉపరితలాలకు యాంటీ బాడీలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా వైరస్‌లకు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రీ-ఫ్యూజన్ స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉంటుంది.

వైరస్ దాని జన్యువు 30,000 న్యూక్లియోటైడ్లతో నిండి ఉంటుంది. ఈ ప్రోటీన్ తయారు చేయడానికి 4,000 న్యూక్లియోటైడ్లను మాత్రమే ఇస్తున్నారు. జన్యువులో 10వ భాగాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఆ న్యూక్లియోటైడ్లు కూడా మార్చేస్తాం.. కోడాన్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు.. న్యూక్లియోటైడ్ల క్రమాన్ని మార్చేస్తారు. అందుకే వ్యాక్సిన్ నిజంగా వైరస్ లాంటిది కాదు.. కానీ వైరల్ ప్రోటీన్ అందిస్తుంది.

రోగ నిరోధక ప్రతిస్పందన ప్రేరేపించడానికి వ్యాక్సిన్లు కార‌ణ‌మ‌వుతాయి. రోగ నిరోధక శక్తిని అందరిలో పెంపొందించాల్సి ఉంది.. దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు. కోట్లాది జనాభాలో హెర్డ్ ఇమ్యూనిటీని తీసుకురావాలంటే 60 లేదా 70% రోగ నిరోధక శక్తి అవసరం. అంటే జనాభాలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దాదాపు 100% మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అలా అయిన‌ప్పుడు ప్ర‌జ‌ల శ‌రీరంలోకి వైర‌స్ వ్యాపించ‌డం త‌గ్గి కొన్నాళ్లు ఆ వైర‌స్ ఉనికిలో లేకుండా పోతుంది.
Tags:    

Similar News