ఇస్కూల్ కోసం ఆ రాష్ట్రానిది అదిరిపోయే ఐడియా

Update: 2016-01-16 05:15 GMT
అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యను మరింత వ్యాప్తి చేయటానికి వీలుగా మహారాష్ట్ర సర్కారు తీసుకున్న ఐడియా అదిరిపోయింది. డిజిటల్ యుగంలోనూ చాలా గ్రామాల్లో విద్య వ్యాప్తి లేకపోవటం.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని సమకూర్చటం ప్రభుత్వాల మీద విపరీతమైన ఆర్థిక భారాన్ని పెంచేలా ఉంటాయి. అయితే.. దీనికి చెక్ చెబుతూ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది.

సాధారణంగా ఇస్కూల్ ఏర్పాటు చేయాలంటే లక్షలాది రూపాయిలతో స్కూల్ భవనాల్ని నిర్మించాల్సి ఉంటుంది. భారీ ఎత్తున స్కూళ్ల ఏర్పాటు అంత సులువైన పనేం కాదు. అందుకే.. పాడైపోయి.. తుక్క కింద మార్చాల్సిన ఆర్టీసీ బస్సుల్ని స్కూల్  గదిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాలం చెల్లిన బస్సుల్ని తక్కు కింద అమ్మటం మినహా మరో అవకాశం లేదు.

ఆ స్థానే.. టైర్లు తొలగించి.. క్లాస్ రూమ్ లుక్ వచ్చేలా చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఐడియా బాగుండటంతో పాటు.. సక్సెస్ కావటంతో మహారాష్ట్రలో కాలం చెల్లిన బస్సులతో క్లాస్ రూమ్ ల్ని రూపొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వారు అనుసరించేందుకు వీలుగా కదూ ఈ ఐడియా.
Tags:    

Similar News