ఇది నానుడి - తెలుగు ప్రజల నోళ్లలో నిరంతరం నానే సామెత. అంతే కాదు తెలుగు వారికి తమ జీవితాలలో వాస్తవ రూపం దాల్చిన సామెత. ఇది తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మరోసారి నిరూపితం అవుతోంది. దీనిని నిరూపించే బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా.. ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ నాయకులే. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 45 రోజుల క్రితమే ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం చేశారు. అదే రోజున 105 మంది తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులను ప్రకటించారు. ఆ రోజు నుంచే ఎన్నికల నగరా మోగించారు. అయితే మహాకూటమి పేరుతో కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి ఒక్కటవ్వాలనుకుంటూ తమ ప్రయత్నాలను ప్రారంభించారు.
మహాకూటమి రోజు రోజుకు మరింత ఆలస్యం అవుతోంది. ఎవరికి ఎన్ని స్థానాలు... ఎక్కడి నుంచి పోటీ చేయాలనే లెక్కలు ఎంతకీ తేలడం లేదు. ఓ వైపు ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా... నోటిఫికేషన్ కు ఒక్క రోజే సమయమున్నా... మహాకూటమి మాత్రం తన అభ్యర్ధులను - ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే అంశాన్ని నానుస్తూనే ఉంది. ఇది ఆయా పార్టీలకు చేటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనినే ఆలస్యం అమృతం విషం అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే... ఓ దశలో కూటమి వైపు అంతా చూసారు. కానీ వీళ్ల మహా ఆలస్యం వల్ల ఇది తెగేదీ కాదు - తెల్లారేది కాదు అని కూటమిని జనం పట్టించుకోవడం మానేశారు.
పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని తెలంగాణ రాష్ట్ర సమితి భావించడంతో రెండు నెలలకు ముందే అభ్యర్ధులను ప్రకటించింది. నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులంతా నిలబడి నీళ్లు తాగినట్లుగా తమ ప్రచారాన్ని హాయిగా చేసుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకుందుకు - తెలంగాణ రాష్ట్ర సమితిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. దీనికి విరుద్ధంగా మహాకూటమి వ్యవహరించడంతో విజయం ఎవరిని వరిస్తుందో ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. మహాకూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు సీట్ల సర్దుబాటు జరిగినా తెలంగాణ జన సమితి - సీపీఐలకు మాత్రం కేటాయించే సీట్ల సంఖ్య తేలడం లేదు.ఇది నానాటికీ కీలకంగా మారుతోంది. సీపీఐ నాయకులు కూడా పట్టిన పట్టు వీడడం లేదు. తమకు కావాల్సినన్ని స్ధానాలు కేటాయించకపోతే కూటమి నుంచి వెళ్లిపోతామని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ నగరంలోని ఏదో ఒక హొటల్ లో కలుసుకుని కూటమిలోనే ఉంటామంటూ ప్రకటిస్తున్నారు. ఇలా రోజుకో మాట చెబుతూండడంతో ప్రజల్లో కూటమి పట్ల చులకన భావం ఏర్పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఈ గందరగోళానికి కారణం కాంగ్రెస్ చేస్తున్న రాజకీయమేనని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి ఆలస్యం అమృతం విషం అనే సామెతను నిజం చేయడం ఖాయంలాగే కనిపిస్తోంది.