రేపు రెండో దశ పోలింగ్.. ఎవరికి అనుకూలం

Update: 2019-04-17 07:27 GMT
ఏప్రిల్ 11న ఏపీ - తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడు రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు. నిన్నటితో రెండో దశ పోలింగ్ కు సంబంధించిన ప్రచారానికి కూడా తెరదించేశారు. రేపు 18న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.

కాగా రెండో దశతోనే దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఇప్పటికే 11న మొదటిదశలోనే తెలంగాణ - ఏపీలో అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ ముగిసింది. రెండో దశలో కర్ణాటకలో 14 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ 18న రేపు నిర్వహించనున్నారు. దాంతోపాటు తమిళనాడులోని 39 పార్లమెంట్ సీట్లకు రేపు పోలింగ్ పూర్తి కానుంది. పాండిచ్చేరిలోని ఒక ఎంపీ సీటుకు కూడా రేపే పోలింగ్ నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా రెండోదశలో మొత్తం 97 ఎంపీ స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా రెండోదశలో పోలింగ్ జరిగే ప్రాంతాలు కాంగ్రెస్ కూటమి గెలిచే స్థానాలు.. తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి మెజార్టీ స్థానాల్లో పోటీ ఉంది. ఈ కీలకమైన స్థానాల్లో రేపే పోలింగ్ కావడంతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది.

* రెండోదశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు.. ఎంపీ  స్థానాలు

+ జమ్మూకాశ్మీర్  - 2 స్థానాలు.
+ యూపీలో - 8
+ బీహార్ లో - 5
+ చత్తీస్ ఘడ్ - 3
+ మహారాష్ట్ర  -10
+ ఒడిశా -5,
+మణిపూర్ -1
+ త్రిపుర - 1
+ పశ్చిమ బెంగాల్ - 3

ఈ రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది.
Tags:    

Similar News