దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకి పైగా నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించగా, ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారం నుండి ఉధృతంగా ఉంది. ఇది మే నెలలో ఉగ్ర రూపం దాలుస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తగ్గు ముఖం పడుతుందని అంటున్నారు . ప్రస్తుతం దేశం మాత్రం హెల్త్ ఎమర్జెన్సీ లో ఉందని చెప్తున్నారు. ఇప్పటికే గణిత నమూనాలను ఉపయోగించి లెక్కించిన శాస్త్రవేత్తలు ఏప్రిల్ రెండో వారం తర్వాత విజృంభించే కరోనా మే నెలలో పీక్స్ కు చేరుతుందని , చివరినాటి నుండి క్షీణిస్తుందని చెప్తున్నారు.
కానీ తాజాగా దేశంలో డబుల్ మ్యూటాంట్ , త్రిబుల్ మ్యూటాంట్ విపరీతంగా దేశంలో పంజా విసురుతున్న వేళ మే చివరి నాటి నుండి అయినా కరోనా తగ్గు ముఖం పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .కానీ తప్పక క్షీణత ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. దేశంలో కరోనా మొదటిదశ కంటే, రెండోదశలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.2020 సెప్టెంబర్ నెలలో వైరస్ తీవ్రత గరిష్టానికి చేరుకొని, 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని సూచించారు. అప్పుడు నిపుణులు అంచనా వేసినట్టే తగ్గింది . కానీ ఇప్పుడు పరిస్థితి , రోజువారీ కేసులు పెరుగుతున్న తీరు శాస్త్రవేత్తల అంచనాలకు అందటం లేదు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఇప్పటికే మూడు లక్షలు దాటి పీక్స్ కు చేరినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఏప్రిల్ నెలలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది .
ఇక మే నెలలో కరోనా మరింత ఉగ్ర రూపం దాల్చి మే చివరి నాటి నుండి క్షీణిస్తుంది అని అంచనా వేస్తున్నారు . కరోనా మహమ్మారి రెండవ దశలో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రభావితం అయ్యింది. ఇక దేశంలో అనేక రాష్ట్రాలు దారుణ స్థితిలో ఉన్నాయి. ఇక ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రజలు ఆందోళన కి గురౌతున్నారు. ఇంత ప్రమాదకర స్థితిలో ఇండియా ఉన్నప్పటికీ దేశ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. ఎక్కడికక్కడ కర్ఫ్యూలు , 144 సెక్షన్ లు , వారాంతపు లాక్ డౌన్ విధిస్తూ కరోనా కట్టడి యత్నాలు చేస్తున్నారు. గాలి నుండి కూడా కరోనా వ్యాపిస్తుంది అని చెప్తున్న నేపధ్యంలో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అంటున్నారు .
దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చింది. నిన్న కొత్తగా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,66,10,481 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 2,624 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,89,544 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. 25,52,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,83,79,832 మందికి వ్యాక్సిన్లు వేశారు.