సెకండ్ వేవ్ : ఏ పేస్ మాస్క్ కరోనా నుండి రక్షిస్తుంది !

Update: 2021-04-25 01:30 GMT
కరోనా వైరస్ .. గత ఏడాదికి పైగా ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. మన దేశంలో కూడా కరోనా కలకలం సృష్టించింది. ఫస్ట్ వేవ్ లో కేసుల తగ్గుదల , కరోనా వ్యాక్సిన్ కూడా రావడంతో ఇక అన్ని సర్దుకున్నాయి అనుకున్నారు. కానీ, సెకండ్ వేవ్ లో కరోనా కేసులు మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయినా కూడా ఇంకా చాలామంది కరోనా నియమాలను పాటించడం లేదు. పేస్ మాస్క్ వాడండి అని చెప్తున్నా కూడా వాడటం లేదు. చాలామంది రోడ్డుపై దొరికే క్లాత్ మాస్క్ తోనే పని కానిచ్చేస్తున్నారు. మరికొంతమంది జరిమానాలకు భయపడి చీప్ గా ఏ మాస్క్ పడితే ఆ మాస్క్ తగిలించుకుంటున్నారు.

కానీ ఇది సెకెండ్ వేవ్. ప్రాధమికంగా మనల్ని కాపాడేది మాస్క్ ఒక్కటే. మాస్క్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా కరోనా కబలించడం ఖాయం. అందుకే మంచి మాస్క్ వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ లో డబుల్ మాస్క్  పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎన్-95 రకానికి చెందిన మాస్క్ అయితే ఒక్కటి సరిపోతుంది. అదే రెగ్యులర్ సర్జికల్ మాస్కులైతే మాత్రం 2 పెట్టుకోమంటున్నారు. క్లాత్ మాస్కులు వాడేవారు, దాంతోపాటు సర్జికల్ మాస్క్ ను కూడా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

మాస్కులపై ఉన్న అపోహల్ని తొలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను విడుదల చేసింది. ఏ మాస్క్ ఏ మేరకు పనితీరు కనబరుస్తుందో అందులో వివరంగా చెప్పింది. గుడ్డతో చేసిన మాస్కులు 50శాతం మాత్రమే పనికొస్తాయని, అదే ఎన్-95 రకానికి చెందిన మాస్కులైతే సమర్థంగా పనిచేస్తాయని చెబుతోంది. ఈ రకానికి చెందిన మాస్కులు బాక్టీరియా, డస్త్, ఇతర రకాల రేణువుల్ని వందశాతం అడ్డుకుంటాయని.. వైరస్ ను 95శాతం నియంత్రిస్తాయని చెబుతున్నారు. ఎన్-99, డబ్ల్యూ-95, ఎఫ్ఎఫ్ పీ-1, రకాలకు చెందిన మాస్కులు కూడా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. రోడ్డుపై దొరికే క్లాత్ మాస్కులు, ఫ్యాషన్ కోసం వాడే స్పాంజ్ మాస్కులు మాత్రం ఈ టైమ్ లో అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. స్పాంజ్ మాస్కులు, గుడ్డతో చేసిసన మాస్కులు వైరస్ ను ఒక్క శాతం కూడా అపలేవని తేల్చారు.
Tags:    

Similar News