మనిషి రూపంలో ఉండే పిశాచాలు కొన్ని ఉంటాయన్న మాటకు ఈవిడ సరిగ్గా సూట్ అవుతారు. ఆమె చేసిన దారుణాలు నోటితో చెప్పేందుకు సైతం సిగ్గుపడే పరిస్థితి. మానవత్వం అన్నది అసలే లేని ఇలాంటి పాషాణ మనస్కులు మన చుట్టూ ఉన్నారన్న ఆలోచనే అసహ్యాన్ని కలిగించేలా చేస్తోంది. అందుకే.. ఇలాంటి దారుణమైన మైండ్ సెట్ ఉన్న తన తల్లి దురాగతాల్నిచూసిన కన్నకొడుకు సైతం భరించలేకపోయాడు. పెను సంచనలంగా మారిన మాజీ ఐఏఎస్ అధికారిణి.. బీజేపీ బహిష్క్రత మహిళా నేత.. సీమా పాత్ర చేసిన దారుణాలు తెలిస్తే.. ఆమెను మనిషిగా గుర్తించటానికి సైతం ఇష్టపడరు.అంతటి ఆరాచకాలకు పాల్పడ్డారు.
తన ఇంట్లో పని చేసే పనిమనిషి చేత ఆమె చేసిన పనులు తెలిస్తే నోట మాట రాదు. పనిమనిషి సునీత నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయించటంతో పాటు.. దారుణంగా హింసించటం.. వాతలు పెట్టటం.. మూత్రం తాగించటం లాంటి ఎన్నో వికారపు చేష్టలకు ఆమె పాల్పడిన వైనం వెలుగు చేసింది. పనిమనిషిని బంధించి.. చిత్ర హింసలకు గురి చేయటం.. వేడి వేడి వస్తువుల్ని ఆమె శరీరంపై కాల్చే విషయం బయటకు వెల్లడైంది.
ఇంతకు ఆమె చేసిన ఈ రాక్షస పనుల గురించి బయటకు ఎలా వచ్చాయన్న విషయంలోకి వెళితే.. అందుకు ఆమె కొడుకే కారణమని చెబుతున్నారు. సీమా పాత్ర కొడుకు ఆయుష్మాన్ జార్ఖండ్ సెక్రటేరియట్ లో పని చేస్తుంటారు.
పని మనిషి సునీత విషయంలో తన తల్లి వ్యవహరించే తీరును ఒక రాష్ట్ర అధికారికి షేర్ చేసుకున్న అతను.. ఆమెను ఎలాగైనా రక్షించాలని కోరారు. దీంతో.. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియటం.. తనిఖీలకు వెళ్లిన అధికారులు.. దారుణమైన స్థితిలో ఉన్న పనిమనిషి సునీతను మగుర్తించారు.
బాధితురాలిని ఆసుపత్రికి తరలించి.. వైద్యం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా తన చేత టాయిలెట్ ను ఎలా శుభ్రం చేయించారన్న విషయం మొదలు.. ఆమె పెట్టిన చిత్రహింసల చిట్టా విప్పటంతో.. విచారణ అధికారులు సైతం కంగు తిన్న పరిస్థితి. ఆమెపై వారెంట్ ఇష్యూ చేయగా.. కనిపించకుండా పోయారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకిదించారు.
ఎట్టకేలకు ఆమెను ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించి.. మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. ఆమె చేసిన దారుణాల గురించి విన్న న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె రాక్షసత్వానికి సంబంధించిన వివరాలు షాకింగ్ గా మారటమే కాదు.. వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.