దేశంలో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానం ఇచ్చే డేర్ అండ్ డాషింగ్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ను సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకున్నాడు. ఇమ్రాన్ తనను తానే అవమానించుకోవడానికి కొత్త మార్గాలని వెతుక్కుంటున్నాడు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి అర్ధం వివరించేలా ఒక అమెరికా న్యూస్ ఛానల్ లో ఇమ్రాన్ మాట్లాడిన వీడియో కూడా సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇమ్రాన్ ఐరాసలో మాట్లాడిన మాటలు వేస్ట్ మాటలు అన్నట్టు యాంకర్ చేసిన కామెంట్స్ ఉన్నాయి.
ఇప్పటికే ఐరాసలో భారత్ తో అణు యుద్ధం, కాశ్మీర్ లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి అంటూ పిచ్చి కుక్కలా వాగుతున్న ఇమ్రాన్ కు భారత్ క్రికెటర్లు మహమ్మద్ షమీ - గౌతమ్ గంభీర్ - హర్భజన్ సింగ్ లాంటి వాళ్లంతా ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వాళ్ళకి తోడు సెహ్వాగ్ కూడా తోడయ్యాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలను గంగూలీ కూడా సమర్దించాడు. శాంతి కోరుకోవాల్సిన దేశం ఇలాంటి మాటలు మాట్లాడడమేంటని, ఐరాసలో ఇమ్రాన్ ప్రసంగం చాలా పేలవంగా ఉందని గంగూలీ అన్నాడు. అసలు క్రికెట్ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్ - ఇప్పుడు చూస్తున్న ఇమ్రాన్ వేర్వేరని గంగూలీ విమర్శించాడు.