వామ్మో.. ఇలా కూడా బంగారాన్ని స్మగుల్డ్ చేస్తున్నారా?

Update: 2021-12-11 05:33 GMT
ఎంతగా అడ్డుకున్నా సరే.. ఏదో రకంగా విదేశాల నుంచి బంగారాన్ని దొంగ మార్గాన తీసుకున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు చేసే ప్రయత్నాలకు చెక్ పడుతోంది శంషాబాద్ ఎయిర్ పోర్టులో. అయినప్పటికీ.. ఎప్పటికప్పుడు కొంగొత్త ప్లాన్లతో బంగారాన్ని తరలిస్తున్న వైనాన్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అక్రమంగా తరలిస్తున్న 7.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇంత భారీ ఎత్తున బంగారాన్ని తరలించటానికి వారు ఎంచుకున్న మార్గం.. వేసిన ఎత్తు తెలిస్తే నోట మాట రాదంతే.

సూడాన్ కు చెందిన ఇద్దరు పురుషులు.. ఇద్దరు స్త్రీలు దుబాయ్ నుంచి ఎయిరిండియా విమానం ఎక్కి శంషాబాద్ కు చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వారు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అందింది.

వీరి సామాన్లను ఎంత క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి బంగారం వారి నుంచి లభ్యం కాలేదు. దీంతో.. మరింత జాగ్రత్తగా వీరిని తనిఖీ చేశారు. అయినప్పటికీ బంగారం జాడ లేదు. దీంతో.. అనుమానించిన అధికారులు వైద్యుల్ని రంగంలోకి దించారు. వారి మల ద్వారం వద్ద పరిశీలించాలని కోరగా.. అక్కడ వైద్యులు తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున బంగారం బయటపడింది.

మొత్తం 7.3 కేజీలు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.3.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంత అక్రమంగా తరలించాలంటే మాత్రం.. మరీ ఇలానా? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.




Tags:    

Similar News