తెలంగాణలో రాజకీయాలు రాజుకుంటున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగుతోంది. కేసీఆర్ సంవత్సరం ముందే గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశాడు. సర్వేల మీద సర్వేలు చేయిస్తూ వచ్చేసారి ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో గెలిచేదెవరు.? ఓడేదెవరు అనే దానిపై లెక్కలు తీస్తున్నారు.. కాగా ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న దాదాపు సగం మంది మంత్రులకు వచ్చేసారి చాన్స్ ఉండదని టీఆర్ ఎస్ లో జోరుగా చర్చ సాగుతోంది.
టీఆర్ ఎస్ మంత్రుల్లో నంబర్ 2 - 3 స్థానాల్లో ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - హోంమంత్రి నాయినీలు వచ్చేసారి క్రియాశీల రాజకీయాల్లో ఉండరనే ప్రచారం జరుగుతోంది. మహమూద్ అలీ తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చి ఆయన పార్టీ సేవ చేస్తాడని సమాచారం. ఇక వయోభారంతో కునారిల్లుతున్న నాయిని నర్సింహారెడ్డి వచ్చే ఎన్నికల్లో అసలు పోటీనే చేయడని.. విశ్రాంతి తీసుకుంటాడని ఆయన సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక మిగిలిన మంత్రుల్లో బీఎస్పీ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ఒకవేళ ఆయన గెలిచినా మంత్రి పదవి దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వరంగల్ పూర్వపు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చందూలాల్ కు కూడా వచ్చేసారి పదవి కష్టమనే భావన వ్యక్తమవుతోంది. వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చందూలాల్ ప్లేసులో మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని.. ఆయనకు హామీ కూడా లభించిందనే టీఆర్ ఎస్ ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎర్రబెల్లితో పాటు కొండా సురేఖకు మహిళా కోటాలో మంత్రి పదవి ఖాయమంటున్నారు.
నల్గొండ - రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రుల గెలుపోటములపైన వారి మంత్రి పదవులు ఆధారపడి ఉంటాయని సమాచారం. ఇక మహబూబ్ నగర్ నుంచి తీవ్ర పోటీ ఉంది. వచ్చేసారి యువనేతలు బరిలోకి దిగుతుండడంతో వారికి గెలిచినా పదవులు అంత త్వరగా దక్కకపోవచ్చు. మెదక్ నుంచి ఎలాగూ హరీష్, కేసీఆర్ లున్నారు. ఇక కరీంనగర్ నుంచి ఆర్థికమంత్రి ఈటెల - కేటీఆర్ లున్నారు. ఇలా పూర్వపు జిల్లాల వారీగా లెక్కలు వేసిన కేసీఆర్ వచ్చేసారి మంత్రి పదవులను సెలెక్టివ్ గా ఇవ్వడానికి రెడీ అయ్యారట..
ఈ నాలుగేళ్లలో ఎంతోమంది సీనియర్లు - ప్రముఖులు టీఆర్ ఎస్ లో చేరారు. వారికి సముచిత స్థానం కల్పించేందుకు కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదు. చేపడితే అసంతృప్తి వ్యక్తమై పార్టీకి నష్టం వాటిల్లుతుందని చేపట్టలేదు. ఈ కారణం చేతనే వచ్చే ఎన్నికల్లో గెలిచే సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడున్న చాలా మంది మంత్రులకు వచ్చే సారి చాన్స్ దక్కదని ప్రచారం జరుగుతోంది.