స్నేహితురాలి కోసం స‌న్యాసానికి బై బై

Update: 2017-03-31 04:17 GMT
మ‌తం ఏదైనా కానీ స‌ద‌రు సిద్దాంతాల‌ను న‌మ్మి సేవ చేసేందుకు స‌న్యాసంలోకి వెళ్లిన ఉదాహ‌ర‌ణ‌లు మ‌నం ఎన్నో విన్నాం, చూశాం. అయితే స‌న్యాసం తీసుకొని స‌ర్వ ప‌రిత్యాగులు అయిన‌ప్ప‌టికీ సాధార‌ణ జీవన విధానాల‌పై ఆస‌క్తి క‌లుగుతుంది. అలా క‌లిగిన ఓ స‌న్యాసి తిరిగి సాధార‌ణ జీవితంవైపు మ‌ళ్లారు. అంతేకాదు ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు. టిబెట్‌ కు చెందిన సీనియ‌ర్ లామా ఒక‌రు ఇండియాలో ఉన్న త‌న చిన్న‌నాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు స‌న్యాసి హోదాను వ‌ద్ద‌నుకున్నారు.

థాయె దోర్జె (33) అనే ఈ లామాను టిబెట‌న్ బుద్ధిజంలోని నాలుగు ప్ర‌ధాన స్కూళ్ల‌లో ఒక‌దాని గురువు అయిన క‌ర్మ‌పా లామా పున‌ర్జ‌న్మ‌గా భావిస్తారు. అయితే ఆయ‌న కార్యాల‌యం మాత్రం ఈ ఆక‌స్మిక ప్ర‌క‌ట‌న‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. దోర్జె ఈ నెల 25న పెళ్లి చేసుకున్నార‌ని, స‌న్యాసి హోదాను వ‌దులుకున్నార‌ని ఆయ‌న కార్యాల‌యం ప్ర‌క‌టించింది. పెళ్లి చేసుకోవాల‌న్న త‌న నిర్ణ‌యం త‌న‌కే కాదు, త‌న వంశానికీ మేలు చేస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు దోర్జె ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. దోర్జె పెళ్లి చేసుకున్న 36 ఏళ్ల రిన్‌ చెన్ యాంగ్‌ జామ్ భూటాన్‌ లో జ‌న్మించింద‌ని, ఇండియా, యూర‌ప్‌ ల‌లో చ‌దువుకుంద‌ని వెల్ల‌డించారు. దోర్జె ఏడాదిన్న‌ర వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచే తాను క‌ర్మ‌ప పున‌ర్జ‌న్మ‌గా చెప్పుకునేవారు. అయితే ద‌లైలామా మ‌ద్ద‌తు ఉన్న మ‌రో లామాను కూడా కొంద‌రు క‌ర్మ‌ప పున‌ర్జ‌న్మ‌గా భావిస్తారు. ఈ వివాదంపై కూడా దోర్జె చాలాసార్లు స్పందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News