దేశంలో సెక్స్ వర్కర్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. దేశంలోని సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా.. గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీచేసి ప్రొఫార్మా ఆధారంగా ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు సుప్రీం బెంచ్ గురువారం తీర్పునిచ్చింది.
సెక్స్ వర్కర్లకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన గెజిటెడ్ ఆఫీసర్స్ జారీ చేసే సర్టిఫికెట్ల ఆధారంగా యూఐడీఏఐ సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు జారీ చేయాలి.
ఆధార్ కార్డులు ఇచ్చేందుకు సెక్స్ వర్కర్లను ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అడగాల్సిన అవసరం లేదు. ఎలాంటి పత్రాలు లేకున్నా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆధార్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని సూచించింది. వాళ్లకు రేషన్ అందేలా చూడాలి. ఓటర్ కార్డులు కూడా అందివ్వాలని కోర్టు సూచించింది.
కోవిడ్ సందర్భంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న వాళ్లలో సెక్స్ వర్కర్స్ ముందుంటారు. జీవనానికి చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ అందించాలని పిటీషన్ దాఖలైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు తాజా సూచనలు చేసింది.
సెక్స్ వర్కర్లు అందరికీ ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకున్నా రేషన్ అందించాలని సూచించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 9 లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్ సెక్స్ వర్కర్లకు మేలు జరుగనుంది.