ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని వేషాలు మార్చినా కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై విచారణ జరుగుతుందనే భయంతోనే వామపక్షాలు, ఎంఐఎం లాంటి పార్టీల నేతలను కలుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌తోనూ పరోక్షంగా దోస్తీ కడుతున్నారని బండి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జీవో 317కు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్‌లో బండి సంజయ్ నిరసన దీక్ష చేశారు.
కేసీఆర్ అతిపెద్ద అవినీతి తిమింగలమని.. ఆయనపై కచ్చితంగా విచారణ జరిపి తీరుతామని బండి స్పష్టం చేశారు. అవినీతి కేసులు బయటపడతాయన్న భయంతోనే థర్డ్ ఫ్రంట్ పేరుతో చర్చలకు తెరలేపారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో సవరించే వరకూ తమ పోరు ఆగదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోని ప్రాజెక్టులతో ఎన్ని ఎకరాలకు అదనంగా నీరు అందించారో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. కొవిడ్ కంటే పెద్ద వైరస్ రాష్ట్రానికి కేసీఆర్‌యేనన్న బండి సంజయ్.. కరోనా తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ ఏర్పాటు చేసి తమ సత్తా చాటుతామని తెలిపారు. కేసీఆర్ ఆధికారంలో ఉండేది రెండేళ్లేనన్న సంజయ్.. తాము అధికారంలోకి రాగానే 317 జీవోను సవరించి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెలిపారు.
``తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే అప్పుడు సీపీఎం వాళ్లను పిలిచిండట. అవినీతిపై విచారణ జరుగుతుందనే మళ్లీ థర్డ్ ఫ్రంట్ తెరపైకి తెచ్చారు. ఇవాళ ఎంఐఎం, సీపీఎం, కాంగ్రెస్‌తో పరోక్షంగా, ప్రత్యక్షంగా దోస్తానా చేస్తున్నరు. కేసీఆర్ నల్లులకే నడక నేర్పిండట. దా బిడ్డ మళ్లీ కృష్ణమ్మకు నడక నేర్పతారా? ఆ విధంగానైనా పాలమూరు జిల్లా కన్నా నీళ్లు వస్తాయి. 575 టీఎంసీలు నీళ్లు రావాల్సిన ప్రాంతానికి కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి వేల కోట్లు రూపాయలు దోచేశారు.`` అని బండి కామెంట్లు చేయడం గమనార్హం.