ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. చరిత్ర పుటలు తిరగవేద్దాం. 1948 సెప్టెంబర్ 17 అంటే ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు నిజాం సంస్థానం హైదారాబాద్ భారతదేశంలో విలీనం అయిన సందర్భం. మరి నాడు బీజేపీ ఈ దేశంలో పుట్టిందా. అలాగే టీయారెస్ పార్టీ అన్నది ఉందా అంటే ఈ రెండు పార్టీలు లేనే లేవు. మరి ఇపుడు సెప్టెంబర్ 17 అంటే ఈ రెండు పార్టీలు అన్నీ చించుకుని మరీ రోడ్ల మీదకు వచ్చేశాయి. తెగ హడావుడి చేసాయి.
మ్యాటర్ ఏంటి అంటే వెరీ సింపుల్ అని చెప్పాలి. ఎన్నికల ఏడాదిలోని అడుగుపెడుతున్న తెలంగాణా రాష్ట్రం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి అన్నదే అంతా అనుకుంటున్న విషయం. నిజానికి తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు అయింది. అందులో ఏడేళ్ళ కాలం గడచిపోయింది. కానీ బీజేపీ కానీ టీయారెస్ కానీ తెలంగాణాకు సంబంధించి సెప్టెంబర్ 17 వేడుకలను జరపలేదు. కనీసం ఆ రోజున చిన్నపాటి సమావేశం కూడా ఈ రెండు పార్టీలు పెట్టి ఎరగవు.
అలాంటిది ఈ రోజున తెలంగాణను తామే అపర సృష్టి చేసినట్లుగా చెప్పుకుంటూ జనాలను మభ్యపెడుతున్నాయి. అంతే కాదు ఓట్ల కోసం సీట్ల కోసం కులాలు మతాలు ప్రాంతాలను రొచ్చులోకి లాగుతున్నాయి. ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణాలో టీయారెస్ అధికారంలో ఉంది. దాంతో ఆ పార్టీ తన అధికార బలాన్ని చూపించి చేయల్సింది చేస్తోంది.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాను టార్గెట్ చేస్తోంది. దాంతో కేంద్ర పెద్దలే దిగి వచ్చి మరీ తడవకోసారి సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో మత విద్వేషాలు వచ్చేలా రెచ్చగొడుతున్నారు. అలాగే కులాల కంపుని కూడా ముందుకు తేస్తున్నారు. మరి ఇలా అయితే తెలంగాణా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు ఎలా వస్తాయి అన్న ఆలోచన అయితే ఈ రెండు పార్టీలకు లేకుండా పోయింది అనే అంటున్నారు.
ఈ రోజున హైదరాబాద్ విశ్వనగరంగా ఉంది. కోటి మంది జనాభా ఈ నగరంలోనే ఉన్నారు. దేశమంతా కాదు ప్రపంచమంతా ఈ నగరం వైపు చూస్తోంది. కానీ చిల్లర రాజకీయం కోసం సంకుచితంగా ఓట్ల వేట కోసం మతాల మధ్య గొడవలు పెడితే వాటి ప్రభావం మహా నగరం మీద పడితే రేపటి రోజున ఇబ్బందులు వస్తే దానికి బాధ్యులు ఎవరు అన్నదే అతి పెద్ద ప్రశ్న. రాజకీయం కోసం తాత్కాలికమైన అధికారాలలా కోసం వందల ఏళ్ళుగా చరిత్ర కలిగి సామరస్యానికి మారు పేరుగా ఉన్న హైదరాబాద్ ని వేరే విధంగా చిత్రీకరించాలని చూస్తే ఆ నష్టం కష్టం ఎవరికి అన్న ఆలోచన చేయాలి కదా.
అయినా సరే మాకు ఇవేమీ పట్టవు అన్నట్లుగా బీజేపీ టీయారెస్ రెండు పార్టీలు రాజకీయ సందడికి తెర లేపాయి. సెప్టెంబర్ 17 అన్నది ఒక చారిత్రక సందర్భం అయితే నాడు జరిగిన కొన్ని చేదు ఘటనలను ఈ రోజు జనం ముందు పెట్టడం ద్వారా బీజేపీ చాలానే రాజకీయంగా బావుకోవలని చూస్తోంది. ఒక రెండు వర్గాల మధ్య చిచ్చు పెడితే రాజకీయంగా పంట పండుతుందనే ఆలోచిస్తున్నారు.
అక్కడ ఒక వర్గానికి మరో వర్గం భయపడుతున్నారన్న సంకేతాలను బీజేపీ పెద్దలు ఇస్తున్నారు. నిజంగా అలా జరుగుతోందా. ఎనిమిదేళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దేశంలో అతి పెద్ద నగరం హైదరాబాద్ లో అలా జనాలు భయపడుతూ బతికే సందర్భాలను కేంద్ర పెద్దలు ఎపుడైనా చూశారా. కానీ ఇవన్నీ కూడా కేవలం రాజకీయం కోసం ఊకదంపుడుగా ఉపన్యాసాలు ఇస్తూ జనాలను ప్రభావితం చేయలనుకుంటున్నారు. అందరూ కలసి ఒకటిగా ఉన్న చోట లేని భయాలను పుట్టించడం ద్వారా రాజకీయ పబ్బం ఎంతమేరకు నెరవేరుతుందో తెలియదు కానీ దాని వల్ల విశ్వ నగరానికి విపరీతమైన నష్టం అన్నది మాత్రం అంతా గుర్తెరగాలి.
ఇక టీయారెస్ కూడా పోటాపోటీగా బస్తీ మే సవాల్ అంటోంది. బీజేపీకి ఏ మాత్రం తక్కువ తినకుండా తన రాజకీయం తాను చేసుకుంటూ పోతోంది. ఈ విధంగా రెండు పార్టీలు పడుతున్న హడావుడిని చూసిన వారు అసలు సెప్టెంబర్ 17 కి ఈ పార్టీలకు మధ్య సంబధం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు చూస్తే గట్టిగా ఏడాది మాత్రమే ఉన్నాయి. దాని కోసం కిందా మీద అవుతూ ఈ రెండు పార్టీలు చేస్తున్న చిల్లర రాజకీయ విన్యాసాల వల్ల లాభం వారికి ఎంత ఉందో తెలియదు కష్టం మాత్రం అందరిదే. అందువల్ల మతం, కులం చిచ్చు నుంచి రొచ్చు నుంచి సమాజమే బయటపడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.