కరోనా వైరస్... విశ్వవ్యాప్తంగా ఆ దేశం, ఈ దేశం అని లేకుండా దాదాపుగా అన్ని దేశాలను హడలెత్తిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ సోకితే... చికిత్సకు మందే లేని ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడిపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా చికిత్సకు కొన్ని మందులు అందుబాటులోకి రాగా... అసలు కరోనా సోకకుండా ఉండేందుకు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోందన్న వార్తలు ఆశాజనకమేనని చెప్పాలి. ఇలాంటి వేళ... కరోనా వ్యాక్సిన్ ను కేవలం రూ.225లకే అందిస్తామంటూ మన దేశానికి చెందిన వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఓ మంచి వార్తను వినిపించింది. నిజమే మరి... ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సల పేరిట లక్షలాది రూపాయలను దోచేస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా... అది సామాన్యుడికి అందుబాటు ధరలో మాత్రం ఉండదన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. అయితే ఈ తరహా భయాలను పటాపంచలు చేస్తూ సీరమ్ ఇన్ స్టిట్యూట్... కరోనా వ్యాక్సిన్ ను కేవలం రూ.225కే అందిస్తామంటూ సంచలన ప్రకటన చేసింది.
గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కరోనా వ్యాక్సిన్ ను అతి తక్కువ ధరకు అందించనున్నట్లుగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ సంస్థలతో సీరమ్ ఇప్పటికే కీలక భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రయోజనం మన దేశానికి మాత్రమే కాకుండా 92 దేశాలకు దక్కనుందట. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కు 150 మిలియన్ డాలర్ల నిధులు అందుతాయి. భారత్‌లో కోట్లాది మందికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సీరమ్ ఇప్పటికే ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారత్‌తో పాటు పలు దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది.
కరోనా వ్యాక్సిన్ తయారీలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన టీకా ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇస్తోందని.. అయితే, ఈ టీకా ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో నోవావాక్స్ ఔషధ సంస్థ కూడా తమ వ్యాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అటు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా చివరి దశ మానవ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా 3 డాలర్లు (సుమారు 225 రూపాయలు) ఉంటుందని సీరమ్ తెలిపింది. 2021 చివరి నాటికి కోట్లాది వ్యాక్సిన్లను అందించాలనేది ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సీరమ్ తెలిపింది.