రాబోయే డిసెంబర్ నాటికి 100 మిలియన్ కోవీషీల్డ్ డోసులు భారత్ లో అందుబాటులోకి రానున్నది. కరోనా వైరస్ కు విరుగుడు టీకాను తయారు చేసే విషయంలో బ్రిటన్లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి-ఆస్ట్రాజెనికా సంస్ధలు సంయుక్తంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్ధలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ను భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవీషీల్డు పేరుతో జనాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది.
ఇదే విషయమై సంస్ధ సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతు డిసెంబర్ నాటికి 100 మిలియన్ డోసులను సిద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. వీటిని అదే నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే టీకాల డ్రైవ్ లో ఉపయోగించబోతున్నట్లు కూడా చెప్పారు. వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తే 1 బిలియన్ డోసుల ఉత్పత్తికి కేంద్రం నుండి అత్యవసర పద్దతిలో అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తామని పూనావాలా చెప్పారు.
కరోనా వైరస్ కు విరుగుడుగా సీరమ్ సంస్ధ ఇప్పటికే ఐదు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇంతే కాకుండా గడచిన రెండు నెలల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 40 మిలియన మోతాదులను కూడా సిద్ధం చేసుంచుంది. ఇది కాకుండా నోవా వ్యాక్స్ టీకాలను రెడీ చేయటానికి కూడా ప్రయత్నాలను చేస్తోంది.