క‌త్తిపోట్ల‌కు వెళ్లిన ఆ ఎమ్మెల్యే సెటిల్‌ మెంట్

Update: 2017-04-02 07:20 GMT
కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న నేత‌లు త‌ర‌చూ పంచాయితీలు నిర్వ‌హించ‌టం కామ‌నే. ఇలాంటి వాటికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేకున్నా.. త‌మ‌కున్న అధికారంతో సెటిల్ మెంట్లు.. పంచాయితీలు నిర్వ‌హిస్తుంటారు. అయితే.. ఇలాంటివి వివాదం కానంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. లెక్క తేడా వ‌స్తేనే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షానికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌. తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌గా మ‌హా దూకుడుగా వ్య‌వ‌హ‌రించే త‌త్త్వం ఉన్న ఆయ‌న‌.. త‌న తీరుతో టీఆర్ ఎస్ అధినేత మ‌న‌సును దోచుకొని మ‌రీ ఎమ్మెల్యే టికెట్‌ ను సంపాదించుకున్నారు.

త‌న‌కున్న ప‌ర‌ప‌తి.. ఫేంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు.. మంత్రిప‌ద‌వి ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపించింది. అందుకు కేసీఆర్ సైతం సుముఖంగా ఉన్న‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అయితే.. మంత్రి ప‌ద‌వి అన్న‌ది అధినేత అనుకున్నా.. రాసి పెట్ట‌లేక‌పోతే ఆఖ‌రి నిమిషంలో అయినా ఆగిపోయే ప‌రిస్థితి. శ్రీనివాస్ గౌడ్ కు కూడా ఇలాంటి ప‌రిస్థితి. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చేందుకు స‌మీక‌ర‌ణాలు వ‌ర్క్‌ వుట్ కాక‌పోవ‌టంతో ఆయ‌న‌కు క్యాబినెట్ లో చోటు ద‌క్క‌లేదు.

తాను మంత్రిని అవుతాన‌ని బ‌లంగా న‌మ్మే శ్రీనివాస్ గౌడ్‌.. తాను మంత్రిని కాలేద‌న్న ఆవేద‌న‌ను అస్స‌లు దాచుకోరు. అప్పుడ‌ప్పుడు కొన్ని వేదిక‌ల మీద త‌న‌కు ప‌ద‌వి రాకుండా చేసిన వారు ఫ‌లానా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం మామూలే. ఇదిలా ఉంటే. శ్రీనివాస్ గౌడ్ త‌న‌కున్న ప‌లుకుబ‌డితో ప‌లు పంచాయితీలు నిర్వ‌ర్తిస్తుంటారు. తాజాగా అలాంటి పంచాయితీ ఆయ‌న‌కు కొత్త స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టింద‌ని చెప్పాలి.

గ‌డిచిన కొంత‌కాలంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్.. కౌన్సిల‌ర్ల మ‌ధ్య వ‌ర్గ‌పోరు సాగుతోంది. దీంతో.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు శ్రీనివాస్ గౌడ్ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు.

ఇరు వ‌ర్గాల్ని త‌న ఇంటికి చ‌ర్చ‌ల‌కు పిలిపించారు. అంతా బాగానే ఉన్నా.. చ‌ర్చ‌కు మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ భ‌ర్త అమ‌ర్‌.. వివాదం ఉన్న ఆనంద్ హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్యే స‌మ‌క్షంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఇంటి బ‌య‌ట ఉన్న ఇరు వ‌ర్గాల వారు క‌త్తుల‌తో పొడుచుకున్నారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో పంచాయితీ మ‌ధ్య‌లో ఆగిపోయింది. క్ష‌త‌గాత్రుల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో.. వారిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌రీ.. సెటిల్ మెంట్ ముచ్చ‌ట‌పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News