ప్రేమ కొందరి జీవితంలో ఆనందాన్ని నింపితే.. మరికొందరి జీవితాల్లో విషాదం మిగుల్చుతుంది. పెళ్లి కొందరి బతుకుల్లో సంతోషాలను మోసుకొస్తే.. మరికొందరి బతుకును కన్నీళ్లమయం చేస్తుంది. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోలేకపోయిన ఓ మహిళ.. పెళ్లి చేసుకున్న వాడితో బతుకును కొనసాగించలేక నరకయాతన అనుభవించింది. చివరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఏం జరిగిందో తెలియదుగానీ.. శాశ్వతంగా కాటికి వెళ్లిపోయింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండ మండలానికి చెందిన యువతీయువకులు ఏడేళ్ల కిందట ప్రేమించుకున్నారు. కానీ.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో.. తల్లిదండ్రులు సూచించిన వ్యక్తినే పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది ఆ అమ్మాయి. అత్తగారిల్లు హైదరాబాద్. అక్కడే ఉంటోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పాత ప్రేమకథ గురించి అందరూ మరిచిపోయారు. ఒక్క ప్రేమించిన ఆ మహిళ తప్ప.
ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడేళ్లు గడిచిపోయాయి. అయినా.. ప్రేమికుడిని మరిచిపోలేకపోయింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. చివరకు ఇద్దరూ విడిగా ఉండలేమనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ కలిసి పారిపోవాలని నిర్ణయించుకొని.. ఇళ్లల్లోంచి వెళ్లిపోయారు. ఈ మహిళ మాత్రం తనతోపాటు తన చిన్నకుమారుడిని కూడా తీసుకొని వెళ్లిపోయింది.
ఎటు వెళ్లిందో.. ఏమైపోయిందో తెలియక కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. వారికి ఫోన్ వచ్చింది. తాము ఇద్దరమూ పారిపోయామని, ఇక తిరిగి రాలేమని, చనిపోతున్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ అయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని ట్రేస్ చేశారు. అక్కడికి వెళ్లి చూడగా.. ఇద్దరూ చనిపోయి ఉన్నారు. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. వారి వెంట తీసుకెళ్లిన బాబు మాత్రం అక్కడ ఏడుస్తూ కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.